Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

Karthika Puranam Day – 1

కార్తీక పురాణము మొదటి (రోజు) అధ్యాయము:

నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం.

ఈ రోజు కార్తీక పురాణం లో మొదటి రోజు పారాయణ విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వాగీశాద్యాస్సుమనసః సర్వార్ధనాం ఉపక్రమే

యన్నత్వా కృత కృత్యాసు తం నమామి గజాననం

శౌనకాది మహామునులు “సకల పురాణగాధావని సూతముని! కలి కల్మష నాశనమూ, కైవల్య దాయకమూ అయినటువంటి కార్తీక మహత్యమును వినిపించి మమ్మల్ని ధన్యులను చేయండి స్వామి”, అని, సూత మహామునిని శౌనకాదులు కోరితే ఈ కార్తీక పురాణము చెప్పటం ప్రారంభమైంది.

కార్తిక మహత్యము ఏ పురాణములోనిది?

వ్యాసభగవానుడు,ఆయన శిష్యుడు అయినటువంటి సూతుడు, మా గురువు అయినటువంటి భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహత్యాన్ని.అష్టాదశ పురాణాలలోని స్కాంద పురాణము, పద్మ పురాణము ఈ రెండింటిలో కూడా చెప్పి ఉన్నారు. ఋషి రాజు అయినటువంటి వశిష్ట మహామునికి. రాజరిషి అయినటువంటి జనక మహాముని కి మధ్య జరిగిన సంభాషణలో వశిష్టుల వారిచే జనకునకు స్కాంద పురాణంలోను, అలాగే కృష్ణ పరమాత్మచే సత్యభామకు పద్మ పురాణంలోనూ ఈ కార్తీక మహత్యము సవిస్తరంగా చెప్పినట్లుగా మనకి 2 పురాణాల లోనూ తెలుస్తోంది.

ప్రతిరోజు నిత్య పారాయణగా ఈ మాసమంతా ఈ కార్తీక పురాణ శ్రవణాన్ని తీసుకుంటే విశేషమైన ఎటువంటి ఫలితాలను కూడా వేదవ్యాసుడు మనకు అందించారు.

కార్తిక పురాణాన్ని ఎవరు ఎవరికి చెప్పారు?

ఒకానొక సందర్భంలో తను తల పెట్టినటువంటి యాగానికి అవసరమైనటువంటి ద్రవ్యాన్ని ఆశిస్తూ వశిష్ఠమహర్షి జనకమహారాజు దగ్గరికి వెళ్ళారు అప్పటి రోజుల్లో మహర్షులు యాగాలు చేయడానికి రాజులు ద్రవ్యాన్ని అందించేవారు. అప్పుడు జనకుడు నమస్కరించి స్వామీ తప్పకుండా మీ యాగానికి కావలసిన ద్రవ్యమంతా నేను ఇస్తాను. మహర్షులు వచ్చినప్పుడు కొన్ని ధర్మసందేహాలు తెలుసుకోవడం రాజులధర్మం. కనుక కార్తీకపురాణం విశేషాలు చెప్పమని ఆయన కోరడం సంభవించింది.

అప్పుడు వశిష్ఠల వారు జనకమహారాజా. పూర్వ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ. ఈ కార్తీక మహత్యం వినాలనే కోరిక కలగదయ్యా నీకా కోరిక కలిగింది కనుక విశ్వ శ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రారంభిస్తాను. 

కార్తిక వ్రతం

కార్తీకమాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా ఎవరైనాసరే చేసేటువంటి స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాన్ని ఇస్తాయి ఈ కార్తీక వ్రతాన్ని ఒక వ్రతంగా తీసుకొని మాస పర్యంతమూ స్నాన దాన జప పూజాదులు చేసుకుంటూ ఉంటే శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభించి అమావాస్య వరకు.ఈ వ్రతం పూర్తవుతుంది.

ప్రతీరోజు స్నానం చేసేటప్పుడు

సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం

నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే

అని స్నానం చేసుకుంటూ ఉంటే. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి అన్ని నదీజలాలను చేరుతుంది అలాగే వాపి కూప  తటాకాదుల యందు సమస్త జలాశయాల్లో అంటే సరస్సులు నదులు. బావులు ఇత్యాదులలో విష్ణువు వ్యాపించి ఉంటారని, ఈ సమయంలో ఎవరైనా సరే స్నానం చేస్తే ప్రాత కాలము నందు ఆ స్నాన ఫలితం వర్ణించనలవి కాదు జనక మహారాజా విశేషమైన ఫలితం వస్తుంది అలాగే. సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలన్నీ కట్టిపెట్టి శివాలయంలో గాని విష విష్ణువు ఆలయంలోగానీ యధాశక్తి దీపాలను పెట్టి తే అక్కడ స్వామి నారాధించి ఆ తర్వాత భక్ష్య భోజ్యాదులు సేవించి ఈ విధంగా వ్రతము పూర్తి చేసినటువంటి వారికి.

పూర్వజన్మసుకృతం లేనటువంటి పాపాలన్నీ కూడా కార్తీక వ్రతము వల్ల హరించుకుపోతాయి. ఈ వ్రతాన్ని వర్ణాశ్రమ లింగ వయో భేదాలు లేకుండా. ఎవరైనా ఆచరించవచ్చు అందరూ ఆచరించగలిగే టటువంటి వ్రతము. మరొక్క విశేష మున్నది  ఈ కార్తీక వ్రతం లో. దాన్ని కార్తీక సోమవార వ్రతం అంటారు జనకమహారాజా అని వశిష్ఠులవారు చెబుతున్నారు.

విన్నంత మాత్రం చేతే మనోవాక్కాయ కర్మల ద్వారా చేయబడేటటు వంటి సర్వ పాపాలను హరింపచేసే శక్తి. ఈ కార్తీక మహత్యానికి ఉన్నది.

కార్తీక సోమవారం

అందునా కార్తీక సోమవారం నాడు ఆచరించే సత్కర్మలకు విశేషంగా ఫలితము లభిస్తుంది. ఆ రోజు చేసే స్నాన జప తపాదులు వేయి అశ్వ మేధ యాగాదుల ఫలితాన్ని అందిస్తాయి అని వ్యాసుల వారు జనకమహారాజు కు చెప్పారు

ఈ సోమవారం వ్రత విధి 6 రకాలు గా ఉంటుంది. ఉపవాసము ఏకభుక్తము నక్త వ్రతము అయాచితము స్నానము తిలదానము. ఉప వాసం అంటే పగలంతా భోజనం చేయకుండా గడిపి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసీ తీర్థం మాత్రమే సేవించి. అలా గడపడం, ఈ రోజుల్లో అది చాలా కష్టం. అలా సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానపానాదులు   యధా విధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవడం అది ఏకభుక్తమౌతుంది పగలంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తే.దాన్ని నక్త వ్రతము అంటారు.

అలాగే భోజనం కొరకు తమకు తాముగా ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేసి, ఎవరూ పిలవక పోతే భోజనం చెయ్యకుండా ఉండడం అయాచిత వ్రతం అంటారు

ఇవన్నీ శక్తి లేనటువంటి వారికీ సులభోపాయము  స్నానము, సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ కూడా,

గంగా గంగేతి యో బ్రూయాత్

యోజనానాం శతాదపి ముక్తః స

సర్వ పాపేబ్యో విష్ణు లోకం సగచ్ఛతి

అనే శ్లోకాన్ని మననం చేస్తూ, గంగని స్మరణం చేస్తూ, స్నానం చేస్తే ఆ ఫలితం కూడా విశేషంగా వస్తుంది.

ఈ మంత్రాలు జపాలు విధానాలు తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేస్తే అదే విశేషమైనటువంటి పద్ధతిలో అదే  విశేష మైనటువంటి ఫలితాలు వారికి కలుగుతాయి అని వశిష్ఠులవారు జనకమహారాజు చెప్పారు.

మిస్తూరి కథ

అంతేకాకుండా మిస్టురీ అనేటువంటి ఒక కథ ఈ రోజు చెప్పుకోవడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఆ శ్రీ భర్తకి ద్రోహం చేసి భయంకర నరకం అనుభవించి ఆ తర్వాత కుక్క జన్మ పొంది 15 జన్మలెత్తిన తర్వాత 15వ జన్మలో కార్తీక సోమవారం నాడు ఒక బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి  బలి, ఆ బలిని భుజించడం వల్ల గత జన్మ స్మృతులు పొంది తద్వారా తాను చేసినటువంటి ఘోరమైన విషయాలను తెలుపు కుంటే ఆ బ్రాహ్మణుడు తాను ఆచరించి నటువంటి సోమవార వ్రతములలో ఒక వ్రతాన్ని ధారపోస్తే విశేషమైనటువంటి దివ్య స్త్రీ శరీరధారిని యై ఆకాశమార్గంలో ఈ ఐహిక  బంధాలనుండి విముక్తి చెంది వెళ్ళిపోతుంది ఈ కథను మిస్టురీ కథ అంటారు.

ఆ రోజు మొదటి రోజు మనం.శ్రవణం చేయవలసిన అవసరం ఉన్నది గనుక విశేషంగా మీకు సూక్ష్మంగా తెలియజేశాను

కార్తిక మాసములో చేయాల్సిన దానాలు

అలాగే ప్రతి రోజూ కార్తిక మాసం లో మనము  తీసుకోవాలిసినటువంటిజాగ్రత్తలు దానధర్మములు ఇత్యాదులు కూడా తెలియ చేస్తూ ఉంటాను మొదటిరోజు. ఉసిరికాయ నిషిద్ధం అలాగే చద్ది ఎంగిలి చల్లని వస్తువులు ఏ రోజూ నిషిద్ధమే. దానం చేయదలచిన వారు నెయ్యిని గాని బంగారాన్ని గానీ పాడ్యమినాడు దానం చేయవచ్చు. ఈ రోజు పూజించాల్సిన దైవము అగ్ని దేవత. తద్వారా తేజోవర్ధనం కలుగుతుంది. విదియ నాడు కలువ పువ్వులు దానం చెయ్య వచ్చు. అలాగే నూనె గానీ, ఉప్పు గానీ దానం చేసి బ్రహ్మ ను పూజిస్తే మనస్తిమితం లభిస్తుంది. మరల రెండవ రోజు అధ్యాయము తో రేపు కలుద్దాం.

ధర్మస్య విజయోస్తు

Karthika Puranam – Day 1:

Namashshivabhyam Navayauvanabhyam Namo Namah Shankara Parvatibhyam.

It is sacred and salutations to Shiva for giving us the opportunity to listen to the Kartika Purana for 30 days from the beginning to the end of the month of Kartika. Let us try to know the details of the first day of recitation in the Kartika Purana today.

Before that

Vagisadhyassumanasah sarvardhanam upakrama

Yannatva Krityasu Tam Namami Gajananam

This Kartika Purana, Lord, make us blessed by hearing the greatness of Kartika, who is the destroyer of Kali Kalmasha and the savior of Kaivalya.

Vyasabhagavan, his disciple Suta and our Guru Bhagwan Vedavyasa sages have mentioned this greatness of Kartika in Ashtadasa Puranas, Skanda Purana and Padma Purana. Vashishta Maharshi, who is the king of Rushi. In the conversation between Janaka Maharaj, who is a royal sage, in the Skanda Purana by the Vasishtas, and also in the Padma Purana by Lord Krishna to Satyabhama, this greatness of Kartika appears to us in 2 Puranas.

If this Kartika purana sravana is taken  Vedavyasa has also given us remarkable results on listening to Karthika purana.

On one occasion Vasishtha Maharshi went to Janakamaharaja hoping for the necessary money for the yaaga where he had thought of performing. In those days, kings used to give money to the sages to perform the yaaga. Then Janaka bows down and says Swami, I will surely give you all the money required for your yaaga.

It is the dharma of kings to know some dharmasndeha when sages come. So it happened that he asked to tell the details of Kartikapurana. Then Janakamaharaja was clarified by  Vasishtha that such a thought of listening to Karthika purana cannot generate in your mind unless you have done a lot of punya in your previous life.

I will begin with the view of Vishwa Shreya as I have a desire to teach this greatness of Kartika.  In the month of Kartika, when the sun is transiting in  Tula, any one can perform the bathing and chanting pujas which will give special results. Take this kartika vrata as a vow and do the bathing and chanting pujas throughout the month starting from Shuddha Padyami till Amavasya.

While taking the sacred bath in the river, one has to chant the following sloka.

Sarva papaharam punyam vratam Karthika sambhavam

Nirvighnam Kurume Deva Damodara Namostute!!

 If you are taking a bath, when the sun enters Libra, the Ganga enters all the river waters in liquid form and also in all the reservoirs i.e. lakes and rivers in Vapi Kupa Tatakadis. It is said that Vishnu is spread in the wells, and if anyone takes a bath at this time, the result of that bath is not to be described in the ancient times. In the evening, all the other businesses are tied up and lamps are lit in the Shiva temple or in the Vishnu temple.

Kartika Vrata also washes away all the sins that are from many previous births.

Varnashrama observes this Vrata regardless of gender and age.

It is a ritual that can be practiced by anyone and everyone. Another special feature is, Kartika vratam. It is called Kartika Somavara Vratham Janakamaharaja says Vasishta.

Just listening is the power to wash away all the sins committed through the deeds of Manovakkaya. This Kartika Mahatya is equal to aswamedha yaga. So this Kartika somavaram has special results. The sage Vyasa told Janakamaharaju that the bathing, chanting japam performed on that day will give the result of a thousand asva medha yaagams. Fasting, Ekabhukta, Nakta Vrata, ayachta, Bathing and  Tiladana.

Upavasam means spending the whole day without food and in the evening after performing shiva abhishekam and after nakshatra darshan, only consuming Tulsi tirtha. Following a discipline like that, is so hard these days.

Those who are not able to do so, take bath in the morning and have lunch in the afternoon and take Tulsi Tirtha instead of dinner, it becomes Ekabhukta.

Also, without trying to eat by your wish, eating only if someone calls you, and not eating if no one calls you, is called ayachita vratam. Even if Samantraka bath is done, If you take a bath while chanting the hymn, remembering the Ganga, the result will also be special.

Janakamaharaju was also told by  Vasishta said that if those who do not know the methods of chanting these mantras donate sesame seeds on Kartika Monday, they will get the same special results.

If anyone performs the following mantra and take bath good punya will reach you,

Ganga gangeti to bruyaat yojananaam satadapi

Muktha sarva papebhyo vishnu lokam sa gachhati.

Besides, a story like Misturi is commonly told today that that  woman betrayed her husband and went through a terrible hell and then took the birth of a dog and after 15 births, in her 15th birth a punya of one of his Karthika somavaram is sacrificed by a Brahmin on Kartika Monday. That special divine woman who observes one of such Monday fasts will attain moksha. The story of the incarnate being freed from these earthly bonds in the sky is called Misturi Katha. On the first day of that day, we need to listen, so it is to inform you in detail, and also on the first day, I will also inform you about the precautions that we should taken in the month of Kartika.

Amla is forbidden as well as chaddi and other cold things are forbidden on any day.

Those who want to donate can donate either ghee or gold on the day of padyami. The deity to be worshiped today is Agni. This will increase the  Tejas energy.

Kaluva flowers can be donated on the day of Vidiya. Also, if you donate oil or salt and worship Brahma, you get peace of mind. See you tomorrow with the second day chapter.

Dharmasya Vijayostu!

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy