Karthika Puranam Day – 4
కార్తీక పురాణము నాల్గవ (రోజు) అధ్యాయము:
నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం.
పవిత్రకార్తీకమాస నమస్సుమాంజలులు.
కార్తీకపురాణము రోజూ మనము నిత్యమూ వింటూనే ఉన్నాం. శ్రవణం చేస్తున్నాం. అందులో భాగంగా నాల్గవ రోజు పారాయణ ఘట్టాన్ని ఇవాళ మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను.
జనకమహారాజుకు వశిష్ఠులవారు చెప్తున్నటువంటి ఈ కార్తీకమహత్యము ఈరోజున పుష్పార్చన, దీపదాన విధానాలు వశిష్ఠులవారు జనకమహారాజుకు చెప్పారు. కార్తీక మాసంలో శ్రీహరిని కమలాలతో పూజిస్తే లక్ష్మీదేవి ఆ భక్తుల ఇంట్లో స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే భక్తి యుక్తులతో పళ్ళని దానం చేస్తే వారిపాపాలన్నీ సూర్యోదయానికి చీకట్లు ఎలా చెదిరిపోతాయో అలా చెదిరిపోతాయి, అంటారు వశిష్ఠులవారు. ఎవరైతే కార్తీకమాసంలో విష్ణుఆలయంలో మావిడాకు తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని సాధిస్తారు. నలుపు లేదా తెల్లని అవిశ పువ్వులతో పూజచేసినవారికి యజ్ఞంచేసేటువంటి ఫలితం లభిస్తుంది. ఇంకా కార్తీకమాసంలో శివుడిని జిల్లేడు పూలతో పూజిస్తే దీర్ఘాయుష్మంతుడై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. ఈ కార్తీకమాసంలో ప్రత్యేకించి నువ్వులదానము, నదీస్నానము, బ్రహ్మపత్రభోజనము, అన్నదానము, ఈ నాలుగూ ఆచరించడం ధర్మంగా చెప్పబడుతూ ఉంటుంది.
స్నానదానాదులు ఆచరించనివారు, లోభత్వాన్ని చూపించినవారు, అంటే యధాశక్తిగా చెయ్యనివారు నికృష్టజన్మలు పొందుతారు, అని వశిష్ఠులవారు జనకమహారాజుకు చెపుతున్నారు. అలాగే కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించినవారు సూర్య మండలాన్ని ఛేదించుకుని స్వర్గానికి వెళ్తారు మహారాజా, అని మరొక్కసూక్ష్మాన్ని చెప్తానువిను, అని వశిష్ఠులవారు జనకమహారాజుకు
కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచారేత్
మాసస్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభితేనృప
తద్పుణ్యం లభించేల్ లభితేఎం రూప
ఓరాజా ! కార్తీక మాసంలో ఆదివారంనాడు గాని, లేదా శుక్లపాడ్యమినాడు గాని, పూర్ణిమనాడు గాని, అమావాస్యనాడు గాని, సంకల్పం చేసుకొని ప్రాతః స్నానమాచరించట వల్ల కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేనివాళ్లు కార్తీకమాసం నెలరోజులూ ఈ సంపూర్ణ కార్తీకమాసపురాణాన్ని చదివినా, విన్నా, ఆ స్థానఫలితాన్ని పొందుతారు. అయితే ఇది కేవలం అశక్తులకే సుమా ! శక్తి ఉన్నవాళ్లు స్నానం చేయకుండా పురాణంమాత్రం వింటాము అంటే ఆ ఫలితం రాదు అని వశిష్ఠుల వారు ఒక హెచ్చరిక చేస్తున్నారు. అలాగే కార్తీక మాసంలో సాయంకాలంలో దేవాలయాల్లో శివ విష్ణు స్తోత్రాలు పఠించేవారు స్వర్గలోకంలో ఉండి అనంతరం ధ్రువలోకాన్ని పొందుతారు.
ఇలా చెపుతూ ఉంటే, మనందరికీ వచ్చినట్లే జనకమహారాజుకు కూడా ఒక సందేహం వచ్చిందట: అయ్యా, వేదాలలో ప్రాయశ్చిత్తకర్మలు చేసుకోనిదే పాపాలకి నిష్కృతిలేదు అని చెప్పబడి ఉన్నది కదా. అల్లాగే ధర్మశాస్త్రాలన్నీ అలాగే చెప్తున్నాయి. కేవలం కార్తీక వ్రతాచరణ చేసినంత మాత్రాన పాపాలు హరించుకు పోతాయి, వైకుంఠాన్నిపొందుతారు, అని చెప్తున్నారు కదా, ఇది ఎలా సంభవం? పుణ్యమాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? అని ఆయన ప్రశ్నించారు. అంటే గండ్ర గొడ్డళ్లతో కూడా కూలవేయడం సాధ్యంకాని ఒక మహావృక్షాన్నో, మహాపర్వతాన్నో, గోటివేళ్ళతో ఎలా తీసివేయగల్గుతాం అని ఆయన ప్రశ్నించారు. మంచిప్రశ్నే కదండీ. మనందరికీ ఉన్న సందేహమే. నిన్నా, మొన్నా వింటున్న వారందరికీ ఈ సందేహం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే చేసిన పాపాలు పోవాలంటే, ఒక వ్రతం చేసినంత మాత్రంచేత పోతాయా? అప్పుడు వశిష్ఠులవారు కూడా మంచి ప్రశ్న వేశావు రాజా, చెబుతాను విను.
మనకు ధర్మము సూక్ష్మమైనది. దాన్ని సూక్ష్మంగానే చూడాలేగాని స్థూలరూపాన్ని మాత్రమే ఆలోచించగూడదు. వేద శాస్త్ర పురాణాలన్నీ కూడా ధర్మ సూక్ష్మాలు మనకందిస్తున్నాయి.
వీటిల్లో సత్వగుణ ప్రధానమైనవీ: ధర్మసూక్ష్మాలూ, కర్మకాండా, తపస్సూ. అలాగే ప్రాయశ్చిత్తాలన్నీకూడా రజోగుణంవల్ల ఏర్పడ్డాయి. తర్కం చేత, అంటే తర్కమంటే దైవేతరచింతనతో: దైవంఉన్నాడా, లేడా? ఆయన ఆలోచన ఎలా ఉంది? రూపం ఉందా, రూపం లేదా? శక్తి మాత్రమే దైవీ శక్తా? ఇత్యాదులు ఆలోచనలన్నీకూడా తర్కశాస్త్రము. ఇవన్నీ, సాగించేవన్నీ కూడా దైవీకృత్యాలే. ఆచరించే దానధర్మాలు ఇవన్నీ ధర్మం యొక్క స్థూల స్వరూపాలు. కానీ, సూక్ష్మస్వరూపాల్లో సత్వగుణ ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ అవి (1) దేశ, (2) కాల, (3) యోగ్యతల వలన విశేష ఫలితాలు సంతరించుకుంటాయి. దేశము అంటే పుణ్యక్షేత్రము. కాలము అంటే పుణ్యకాలం. అందుకనే మనకి పుష్కర సమయంలో స్నానం చేయండి, కాశీ లాంటి క్షేత్రానికి వెళ్ళండి. మల్టిప్లయ్యర్ ఎఫెక్ట్ అంటాం మనం దాన్ని ఆంగ్లంలో. యోగ్యత అంటే పాత్రత, బ్రహ్మజ్ఞత కలిగిన వారని. ఈ మూడింటిని చింతించకుండా చేసే సర్వధర్మాలూ పాపాలు నశించకుండా చేస్తాయి. కాబట్టి దేశకాలయోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు మహారాజా. ఇవన్నీ సత్వధర్మాలు. ఈ కాలము పవిత్రమైనటువంటిది. కార్తీక మాసము అటువంటిది. పర్వతం అంత ఎత్తు కట్టెలుపేర్చి, వాటిమధ్య గురివిందగింజంత అగ్ని కణాన్నిఉంచిచూడు మహారాజా. ఆ కట్టెలన్నీ దహించివేయబడతాయా లేదా? అని ఆయన మళ్ళీ ప్రశ్నించారు. ఈ సందేహాలు సహజమైనటువంటివే.ఈ సందేహాలకు నివృత్తిగా అజామీలోపాఖ్యానము ఒక కథ చెప్తాను విను అనిఒక కథ చెప్పడం ప్రారంభించారు. చాలా విస్తృతంగా ఉంటుంది కథ. కానీ సూక్ష్మంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను.
సత్యనిష్టుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడికి అజామిళుడు అనేటటువంటి ఒక కుమారుడు జన్మించాడు. వాడు పరమ దురాచారుడై, దాసీ సాంగత్య పరుడై, హింసాప్రియుడై, కేవలం కామాంధుడై, వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి, కామాసక్తుడై ప్రవర్తించ సాగాడు. వాడిజీవితం అలా గడిచిపోతున్నది. ఆ దాసీసాంగత్యం వలన వల్ల వారికి కలిగినటువంటి కుమారుడికి నారాయణ అని నామకరణం చేసాడు. వాని యందు అమితమైన ప్రేమతో ఉండేవాడు ఈ అజామిళుడు. అతన్ని నారాయణా, నారాయణా, అని ప్రేమగా పిలుచుకుండేవాడు. చివరికి అవసాన దశ ఏర్పడింది. యమదూతలు వచ్చారు. ప్రాణావసానా సమయాన కూడా అతను పుత్రవాత్సల్యాన్ని విడిపించుకోలేక , ” నారాయణా, నారాయణా,నారాయణా “, అని కొడుకుని పిలుస్తున్నాడు. కానీ ఆ పిలుపు కొడుక్కు వినపడలేదు గాని యమదూతలు రానేవచ్చారు. ఆ సమయంలో యమదూతల్ని అడ్డగిస్తూ విష్ణుదూతలు అక్కడికి వచ్చారు. వచ్చి, “పక్కకు తప్పుకోండి. ఇతడు మీలోకము కాదు. మాలోకమునకు రావలసిన వాడు. మాలోకానికి తీసుకు వెడతాం”, అని విష్ణుదూతలు విష్ణులోకానికి తీసుకు వెళ్లే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ఉపాఖ్యానము రేపటి రోజు కూడా కొనసాగిడుతుంది. మరిన్ని విషయాలు తెలుసు కుందాం.
అయితే, రేపటి రోజు పంచమి. పంచమి నాడు పులుపుతోకూడిన వస్తువులు నిషిధ్ధాలు. తినకూడదు. అంటే పులిహోర లాంటివేవీ చేసుకోకండి. అలాగే స్వయంపాకం ఇవ్వటం కూడా విశేషంగా చెప్పబడి ఉన్నది. విసినకర్రదానం కూడా చేయవచ్చు. పంచమినాడు ఆదిశేషుని పూజిస్తే, కీర్తిమంతులు అవుతారు అంటున్నది కార్తీకపురాణం విశేషంగా. కాబట్టి ఇవన్నీ ఆచరిస్తూ,
ధర్మస్య విజయోస్తు!
Karthika Puranam – Day 4:
Namashshivabhyam Navayauvanabhyam Namo Namah Shankara Parvatibhyam
In the narration of Kaartheeka PuraaNam by sage Vasishta to King Janaka, today’s topic is about the procedure for prayer using flowers and donation of lamp. If one prays to Srihari during Kaartheeka Maasam with lotus flowers, Lakshmi (Goddess of Wealth) will reside permanently in their house. If you donate fruits with devotion, your sins will disappear just as darkness disappears at sunrise, said Sage Vasishta. Whoever ties string of mango leaves in a VishNu temple will reach paramapada (ultimate level of existence). If you pray with black or white Avisa flowers (Hummingbird flower), you will get the same result as one who performs a yajna (fire ritual). During Kaartheeka Maasam, if you pray to Siva with jilledu (crown flower) leaves, you will live a long life and attain Moksha (liberation from cycle of life and death). Four rituals are compulsory during Kaartheeka Maasam: (1) Donating til (sesame seeds) (2) River bath (3) Eating on a Brahmapathra (4) Feeding guests.
Sage Vasista said to King Janaka, “Those who do not take bath, etc., or exhibit miserliness (which implies not donating as per one’s financial status) will be born into very low births. On the other hand, those who, during Kaartheeka Maasam, pray to Srihari with Kadamba flowers (burflower) will go higher than Soorya Mandalam (solar system) and will go to heaven.
Kaartheeke bhaanu vaarathu snaana karma samaachareth
Maasam samaanena yathupunyam tathpunyam labhite nrupa
(Oh King, those who bathe on a Sunday of Kaartheeka Maasam will receive the same punyam as those who do it every day of the month.
“O Raja! During Kaartheeka Maasam if one takes the appropriate Sankalpam (ritual for starting an act) and does early morning bath on either a Sunday or Shukla Paadyami (first day of the rising lunar fortnight) or on full moon day or on new moon day ( last day of the lunar month), one gets all the punyam(virtue) of doing bath on ALL days of the month. If you are not strong enough for doing it everyday, reading or listening to Kaartheeka Puraanam will shower the same benefit. However, this is only for those incapable. Sage Viswamitra warns us that if we avoid having bath in spite of availability of facility and capacity, we will not get the benefit. Those who chant Vishnu or Siva Sthothraas in a temple during Kaartheeka Maasam will go to Dhruva Lokam after going to heaven.
As the sage was saying this, King Janaka had a doubt, just as most of us are likely to get: Vedas say that there is no relief from our sins unless we do some acts to offset them. Our dharma shaastraas (scriptures) also state the same rule. But you are now saying that by merely doing Kaartheeka Maasa Vratham, one is rid of all sins, and one attains Vaikuntham (Abode of Sri Vishnu). How is this possible? How can severe sins be canceled by virtuous deeds alone? For example, how can we, using only our nails, pinch away a huge tree/ mountain that can only be brought down by big axes?
A good question. Those who have been listening to the discourse for the last two days are sure to get this doubt. How can sins done by us be canceled by a Vratam?
Sage Viswamitra replied “Raja, you posed a good question. Dharma (righteous living ) is very subtle and of microscopic nature. We should look at it as such, but not at the macroscopic level. Vedas, shaastraas, and puraanaas, in fact, all our ancient scriptures, teach us the microscopic nature of dharma. Some of these are based on Sattva guna ( good qualities): subtle aspects of Dharma; Ritualistic practices; penance.
The Praayaschittas (atonements) are formed due to Rajoguna (passion mode). Logic/reasoning raises questions like: Does God exist or not? What is his thinking? Does he have a form or not? Is God pure energy? All such questions belong to Tarka Shaastra (science of Logic). All these acts are also inspired by God. Acts of Donation/ Philanthropy, etc. are the gross form of Dharma. Good deeds are the subtle form of Dharma, though they appear to be small, achieve magnified special fruits due to 1. Desam (Location), 2. Kaalam (Time) and 3. Yogyatha (Eligibility). Location here implies a holy place. Time means a holy time. That is why we are advised to go to holy places like VaaraNaasi and during holy times like pushkaram (a period of 12 days that recurs in a 12-year cycle for each river).This is called “multiplier effect”. Yogyatha is how deserving and eligible we are. Good acts performed without considering these three multipliers will not erase our sins. This Kaartheeka Maasam is a sacred period.
Look at this example: Pile up a mountain high dry firewood and apply a small spark of fire at the bottom. Are not all the pieces of wood burning down? Your doubts are natural, and I will narrate the story of AjaamiLa which clarifies this point.
[This is a very long story, but I will try and give you the gist]
A brahmin by name Sathyanishtta had a son by name AjaamiLa, who went into bad ways. He slept with servant maids, took pleasure in violence, gave up all holy rituals, and spent all his life satisfying his sexual desires. Through a servant maid, he got a son whom he named NaaraayaNa. He was extremely fond of his son and used to call him all the time “NaaraayaNa” , “NaaraayaNa”. Even at the time of leaving his body, AjaamiLa could not give up the deep attachment to his son and called out loudly, “NaaraayaNa! NaaraayaNa! NaaraayaNa!”. The son was away and so could not hear the call. But the yamdoothaas (messengers of death) came promptly and wanted to take to him away. But Vishnudoothaas (messengers of Vishnu) also arrived there and prevented Yamadoothaas saying, “Please step aside”. He deserves to come to our world and not yours. So we shall take him there”. They made all necessary arrangements.
This story will continue tomorrow also, and we will learn some more aspects.
Tomorrow is Panchami (fifth day). On Panchami, do not consume sour items like pulihora (tamarind rice/ lemon rice ). Donating a hand fan and swayam paakam (provision for the receiver to cook by himself). If you do pooja to Aadiseshu (the premordial snake, who is the resting bed for Sri Vishnu), you will attain fame, says Kaartheeka Puraanam.
Dharmasya Vijayosthu!