Karthika Puranam Day – 10
కార్తీక పురాణము పదవ (రోజు) అధ్యాయము:
నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం.
కార్తీక పురాణంలో ఈరోజు పదవ రోజు పారాయణం చేయవలసిన విషయాన్ని మీకు మనవి చేస్తాను.
ఒకానొకప్పుడు కృతయుగంలో, వైకుంఠంలో సింహాసనాన్ని అలంకరించి ఉండగా, అక్కడికి భూలోకంలో వేదవిధులు అడుగంటిపోయాయని, జ్ఞానులు సుఖాలకు లోనైపోతున్నారని, ప్రజలంతా వికృతమై ఉన్నారని శ్రీమన్నారాయణునికి వేదమాత నమస్కరించి చెప్పిందట.
అప్పుడు ఆమె “స్వామీ! వారు ఎలా విముక్తి పొందుతారో తెలియడం లేదు, నాకు చాలా ఖమేస్తోంది. మీరు మార్గం చూపించాలి” అని ప్రార్థించింది.
తదుపరి శ్రీమన్నారాయణుడు సతీసమేతుడై, ఒక వృద్ధ బ్రాహ్మణ దంపతుల రూపంలో
తీర్థక్షేత్రాలు పరిభ్రమిస్తూ పరిశుద్ధులను పరిరక్షించసాగాడు. కొందరు వారిని హేళన చేశారు, కొందరు ప్రతిమలుగా పూజించారు, కానీ నిజంగా వారిని గుర్తించినవారు కొద్దిమంది మాత్రమే.
అందులో ఒక జ్ఞాని వారిని చూసి భావించాడు —“ఓ స్వామీ! నీవే సర్వాధికారివి. స్థావరజంగమ రూపమైన సమస్త ప్రపంచం నీ వల్లే ఉద్భవిస్తోంది. మాయతో సహా అన్ని నీయందే ప్రస్పుటమవుతున్నాయి. ప్రపంచం ఆరంభం, మధ్య, అంతం అంతా నీవే కదా!
భక్ష్యభోజ్యచోషలేఖ్యాదిరూపాలైన యజ్ఞస్వరూపుడవు నీవే!”
అలా స్తుతిస్తూ చెప్పాడు:
“సాక్షాత్ విష్ణుస్వరూపుడవు నీవు, విశ్వవ్యాప్తుడవు నీవే.విశ్వమంతా నీలోనే ఉత్పన్నమై, నీలోనే లయమవుతోంది.సర్వభూత హృదయాల్లో నీవే వాసిస్తావు —
‘ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే తిష్ఠతి’ అని భగవద్గీతలో చెప్పబడింది.”
అతడు మున్ముందు కొనసాగించి స్తోత్రం చేశాడు —
“త్రిలోకవాసి, అనంత పరమాత్మ, పరమహంస, దయామయ విష్ణూ! నీకు నమస్కారం.
వేదాలు, శాస్త్రాలు, పురాణాలు కూడా నిన్ను పూర్తిగా దర్శించలేవు. నీ భక్తి సేవతో, అంజనదృష్టితోనే నీ రూపరహిత స్వరూపాన్ని గ్రహించవచ్చు.”
అలా ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, గజేంద్రాదుల వంటి భక్తులను రక్షించిన
నీ నామస్మరణతోనే పాపాలు నశిస్తాయని పేర్కొన్నాడు.
ఓ కేశవ! నారాయణ! గోవింద! విష్ణో! మధుసూదన! త్రివిక్రమ! వామన! శ్రీధర!
హృషీకేశ! పద్మనాభ! దామోదర! కృష్ణ! వాసుదేవా!
అని నానావిధాలుగా స్తోత్రం చేయసాగాడు.విష్ణుమూర్తి సంతోషించి చెప్పాడు:
“ఓ అజ్ఞానసిద్ధా! నీ స్తోత్రం నన్ను చాలా సంతోషపరిచింది, ఏ వరం కావాలో కోరుకో!”
అప్పుడు ఆయన “నాకు వైకుంఠవాసం ప్రసాదించు స్వామీ” అని కోరగా, విష్ణువు “తథాస్తు” అన్నాడు.
అతనికి చెప్పాడు:
“ఈ నెలలో పాపులు సైతం సులభంగా తరించేందుకు కొన్ని సూత్రాలు చెబుతాను విను.
నేను ప్రతి ఆషాఢ శుద్ధ పద్యమున, లక్ష్మీ సమేతుడై పాలసముద్రంలో నిద్రిస్తాను.
కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను.
చాతుర్మాస వ్రతాచరణ ఎంతో పుణ్యఫలమిచ్చేది. నా భక్తులను పరీక్షించడానికి నేను నిద్రిస్తాను.
నీవు చేసిన ఈ స్తోత్రాన్ని త్రికాలంలో పఠించినవారు తరిస్తారు. ఇది లోకంలో ప్రచారం చేయి — పరోపకారానికి ప్రేరణనివ్వు!”
ఇలా ఆజ్ఞాపించిన తరువాత, విష్ణుభగవానుడు చాతుర్మాస వ్రతం గురించి వివరిస్తూ ర్మమార్గం బోధించాడు.
చాతుర్మాస వ్రతం సర్వవర్ణాలకూ, స్త్రీపురుషులకు, పిల్లలకు, పెద్దలకు సమానంగా
పుణ్యప్రదమని ఈ అధ్యాయం చెబుతోంది.
అలాగే వశిష్ఠుడు జనకుని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు —ఒకనాడు అత్రి మహర్షి అగస్త్యునితో సంభాషిస్తూ, కార్తీకమాస మహాత్మ్యాన్ని వివరించాడు.
అత్రి మహర్షి అన్నాడు —
“ఓ అగస్త్యా! వేదసమానమైన శాస్త్రం లేదు, ఆరోగ్యసమానమైన ఆనందం లేదు, హరికి సమానమైన దైవం లేదు, కార్తీకానికి సమానమైన మాసం లేదు.
కార్తీక స్నానాలు, దీపారాధనలు, విష్ణువర్చనలు — ఇవన్నీ సమస్త వాంఛలను నెరవేర్చుతాయి.
కలియుగంలో ప్రాణులు కేవలం విష్ణుభక్తితోనే విజ్ఞానవంతులవుతారు.”
తదుపరి అగస్త్యుడు పురంజయుని ఇతిహాసాన్ని చెప్పాడు. పురంజయుడు సూర్యవంశ క్షత్రియుడు, అయోధ్యను పాలించిన చక్రవర్తి. అతను అహంకారంతో ధర్మవిహీనుడైపోయాడు.దాంతో ఇతర రాజులు ఏకమై యుద్ధానికి సిద్ధమయ్యారు.
పురంజయుడు తన బలంతో యుద్ధానికి బయలుదేరి, రథగజతురగదళాలతో శత్రువులను ఎదుర్కొన్నాడు.
ఇక్కడితో ఈరోజు అంశం ముగిద్దాం.
రేపటి అంశం: ఏకాదశి మహిమ.
ఏకాదశి నాడు పులుపు, ఉసిరి తినకూడదు.
ఏకాదశి ఉపవాసం విశేష ఫలప్రదం.
రుద్రాయ స్వాహా, నమః శివాయ జపం చేయాలి.
ధనప్రాప్తి, పదవీ లాభం, సుఖశాంతులు లభిస్తాయి.
ధర్మస్య విజయోస్తు!
Karthika Puranam – Day 10:
Namashshivabhyam Navayauvanabhyam Namo Namah Shankara Parvatibhyam
I offer my salutations and wish you all a good morning. Today marks the tenth day of the Kārttika Purāṇa recital, and I will now share the theme for today’s reading.
Once upon a time, during the Kṛta Yuga, Lord Vishnu was seated on His celestial throne in Vaikuntha. The divine beings approached Him and said:
“O Lord! On earth, Vedic rituals and righteous conduct are declining. Even the wise have succumbed to material pleasures, and the people have fallen into delusion. None seem to know the way to liberation. We are deeply troubled—please show us the path.”
Hearing their plea, Śrīman Nārāyaṇa, along with His consort Lakṣmī, incarnated on earth in the form of an aged Brahmin couple, wandering through sacred pilgrimage sites, purifying those places by their presence.
Some mocked them, while others, mistaking them for mere idols, worshiped them. Only a few recognized the truth of who they were.
Among those few was a wise sage who recognized the divine pair and said:
“O Lord! You are the Supreme Ruler. The entire universe, moving and unmoving, originates from You. Everything—cause and effect, creation and dissolution—is contained in You. You are the seed of Māyā, pervading the cosmos as both the beginning and the end. You are the food and the eater, the rituals, and their purpose. You are the visible form of Viṣṇu Himself. The scriptures declare that all-pervading existence is none other than You.”
He continued his praise, saying:
“O Lord Viṣṇu! You pervade the hearts of all beings, as said in the Bhagavad Gītā—‘Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe tiṣṭhati.’ You are the infinite, the Supreme Soul, the compassionate guru beyond all attributes. Even the Vedas and Śāstras cannot truly reveal You—only those who serve You with pure devotion, humility, and love can behold You as the inner Self.”
He then recalled the devotees protected by the Lord—Prahlāda, Dhruva, Mārkaṇḍeya, Vibhīṣaṇa, Gajendra, and many others—and said:
“O Keśava! O Nārāyaṇa! O Govinda! O Mādhava! O Viṣṇu! O Madhusūdana! O Trivikrama! O Vāmana! O Śrīdhara! O Hṛṣīkeśa! O Padmanābha! O Dāmodara! O Kṛṣṇa! O Vāsudeva! We praise You in all these forms!”
Pleased with his devotion, Lord Viṣṇu appeared and said:
“O sage Ajñāna-siddha, I am delighted by your hymn. Ask for any boon you wish.”
The sage replied:
“Grant me residence in Vaikuntha, O Lord.”
The Lord said, “Tathāstu!” (So be it) and continued:
“Listen carefully, O noble one. Even sinners can easily attain liberation in this sacred month of Kārttika. Every year, on the full-moon day of Āṣāḍha, I go to rest in the ocean of milk with Lakṣmī, and on the Dvādaśī of Kārttika Śukla Pakṣa, I awaken. Those who observe virtuous conduct during these four months (Chāturmāsya-vrata) dwell in My presence. Though I do not truly sleep or wake, I perform these acts to test My devotees.
Whoever recites this hymn thrice daily shall attain liberation. Therefore, go forth, spread this teaching, and serve humanity.”
From that time onward, the observance of Chāturmāsya became sanctified. The Lord declared that all—men, women, children, and elders—who observe this vow with faith will be liberated.
Through this vrata, the Lord offers an easy means of salvation.
In this same chapter, Maharṣi Vasiṣṭha, at King Janaka’s request, continued teaching:
“O noble King! Once, a conversation took place between the great sages Atri and Agastya. Atri said to Agastya: ‘For the welfare of the three worlds, I shall narrate to you the greatness of the month of Kārttika, a sacred tale of Lord Hari.
There is no scripture equal to the Vedas, no happiness equal to health, no deity equal to Hari, and no month equal to Kārttika. Bathing, offering lamps, and worshiping Viṣṇu in this month grants every desired blessing. Especially in this Kali Yuga, beings attain knowledge, discernment, and victory solely through devotion to Viṣṇu.’”
To prove this, he narrated the legend of King Puranjaya, a descendant of the Solar dynasty who once ruled Ayodhya. Though once righteous, he grew arrogant and strayed from dharma. Seeing this, neighboring kings united to oppose him, for:
“Dharma eva hato hanti, dharmo rakṣati rakṣitaḥ —
When dharma is destroyed, it destroys; when protected, it protects.”
Thus, war broke out. King Puranjaya, proud of his might, marched with his vast army—his elephants, horses, chariots, and infantry resplendent with banners and weapons. Yet, as the sages say, strength without righteousness brings downfall.
Here ends today’s narration.
Tomorrow we shall continue with the next episode.
Since today is the tenth day, tomorrow being Ekādaśī, devotees are advised to observe fasting, avoiding sour foods like gooseberries (usiri), and instead worship Lord Śiva with the chant:
“Rudrāya svāhā, namaḥ śivāya, namaḥ śivāya, namaḥ!”
By doing so, one gains prosperity, success, and peace.
We shall meet again tomorrow with the next part of the Kārttika Purāṇa.
Dharmasya Vijayostu!
(May Dharma be victorious!)