Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

లక్ష్య సాధన – దాక్ష్యం

Dharma Vaani – K C Das Memorial Charitable Trust

లక్ష్యసాధనలో భాగంగా మనకు ఉండాల్సిన తరువాత లక్షణం దాక్ష్యం. దాక్ష్యం అంటే దక్షత కలిగి ఉండటం. అంటే ఏదయితే పనిని సంకల్పం చేసామో, ఆ పనిని సాధించటం కొరకు విశేషమైనటువంటి, నిర్ణయాత్మకమైనటువంటి, నిశ్చయాత్మకమైన బలమైన కోరికతో మానవుడు ఉంటే గాని ఆ దక్షత కలిగి ఉండడు. చేసే పని మొదలు పెట్టిన తరువాత, ‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్’ అని అంటాడు ఒక కవి. దారిలో ఏమన్నా ఆటంకాలు ఎదురవుతాయేమో అన్న భయంతో అధములు అసలు పనినే మొదలుపెట్టరట. ‘అది చాలా పెద్ద పని, మనతో అవుతుందో లేదో, నాకెందుకులే ఈ పని, ఉన్నవాళ్లము సంతోషముగా ఉన్నామా లేదా’, ఇత్యాది ఆలోచనతో మంచి పనులకు శ్రీకారం చుట్టటం కూడా మానేస్తున్నారు.

ఈ రోజుల్లో concentration divert చెయ్యటానికి facebook అని, youtube అని, instagram అని, TV అని సినిమాలని మాధ్యమాలు చాలా ఉన్నాయి. ఈ మాధ్యమాల నుంచి తనను తాను మళ్ళించుకొని, తన యొక్క లక్ష్యము నందు ద్రుష్టి కలిగి ఉండి, ఈ మాధ్యమాలను కూడా తన యొక్క లక్ష్యానికి చేరటం కోసం ఉపయోగించుకొని, తనకు కావాల్సినదేదో తాను నిర్ణయించుకొని, ఆ కావాల్సిన దాని కోసం ఉన్న అన్ని మాధ్యమాలను వినియోగించుకొని, అందుకు కావాల్సిన సమాచారాన్ని సేకరించుకోవాలి. అదే దక్షత. ఆ మాధ్యమాలలో అనవసరమైన విషయాలు చాలా ఉన్నప్పటికి, వాటిమీద ద్రుష్టి మరల్చకుండా, మనస్సు పెట్టి, తాను అనుకున్నది సాధించటానికి కావాల్సినవి మాత్రమే చేస్తూ ఉంటే దానిని దక్షత కలిగి ఉండటం అంటారు.

ఈ నిర్ద్వందమైనటువంటి ఆలోచనా విధానములో లక్ష్యము నందే గనుక మనస్సు లగ్నము చేసి ఉంటే భగవంతుడు పరోక్ష పెడతాడు, పరిస్థితులు పరీక్షలు పెడతాయి, సమాజం పరీక్ష పెడుతుంది. ఈ పరిక్షలన్నిటిని మన శక్తి యుక్తులతో, ఎవ్వరిని నొప్పించకుండా సాధించగలగాలి. ప్రతి వ్యక్తి కూడా తన జీవితములో ఎన్నో విభిన్న ధర్మాలను నిర్వహించవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితులలో తన లక్ష్యసాధన కొరకు కావాల్సిన మనః ప్రవృత్తిని ఎంచుకొని, అడ్డంగా ఉన్నటువంటి అడ్డంకులను శక్తియుక్తులను, అవసరముంటే యుక్తి, మరి అవసరమనుకుంటే శక్తి కూడగట్టుకోవాలి.

చాలా మంది ఏమనుకుంటారంటే ‘నాకా శక్తి లేదు’ అంటారు. శక్తి ఎవరికి ఉండదు, అలాగని శక్తి అందరికి ఉంటుంది. each soule is potentially divine అంటారు స్వామి వివేకానంద. కనుక శక్తి ఒకచోట ఉండదు. శక్తి కనపడదు. ‘యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా… ‘ అని మనము ఆ జగదాంబను స్తోత్రం చేస్తాము. కాబట్టి దక్షత కలగాలంటే శక్తి, సమర్థత రెండు కలిగి ఉండాలి. దక్షత అంటే capability. కాబట్టి శక్తిని కూడగట్టుకోవాలి, శక్తి ఉండదు. శక్తి ఎలా కూడగట్టుకోవాలో దానికి ఒక ప్రణాళిక వేసుకొని, ధైర్యాన్ని కూడగట్టుకోవాలి.

‘ధైర్యే సాహసే లక్ష్మి’ అన్నారు. ఎవరు ఆ దైర్యం చేస్తారో, వారికి ఆ లక్ష్మి వరిస్తుంది. ఆ లక్ష్మి ధనలక్ష్మి కావచ్చు, ధైర్యలక్ష్మి కావచ్చు, విజయలక్ష్మి కావచ్చు, సంతాన లక్ష్మి కావచ్చు, ఏ లక్ష్మి స్వరూపమైన దైర్యం చేసిన వారిని వరిస్తుంది. ఈ దక్షత అనేటువంటిది, అచంచలమైన, అపారమైనటువంటి నమ్మకముతో ఎవరైతే ఉంటారో, వారికి ఆ దక్షతకు కావాల్సిన లక్షణాలు, పరిస్థితులన్నీ కూడా అనుకూలముగా ఏర్పడి తననుకున్నది తాను సాధిస్తాడు. అందుకు మనకు సమాజములో అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. కాళ్ళు లేకుండా నాట్యం చేసేటువంటి వారు ఉన్నారు, సంగీతం నేర్చుకోకుండా సంగీతం సాధన చెయ్యకుండా వేలకు వేలు పాటలు పడినటువంటి గంధర్వులు ఉన్నారు.

నిశ్చయతకమైన బుద్ది గనుక ఉంటే, నిర్ణయాత్మకమైన ఆలోచనలు కలుగుతాయి. అప్పుడు సాకారత్కామైన పనులు చేస్తాడు, హర్ష ఆమోదాలతో కూడిన ఫలితాలు కలుగుతాయి. దానినే దక్షత అన్నారు పెద్దలు. దక్షత అంటే తేలికగా అర్థం చెప్పుకోవాలంటే,’ నాకు కావాలి అనేటువంటి బలమైన కోరిక ఉంటే అదే ఇచ్చాశక్తి. ఆ కోరికని అనుసరించి ఎలా సాధించాలో బుద్ది మార్గం చూపిస్తుంది, ప్రేరేపిస్తుంది, ప్రచోదన చేస్తుంది అదే జ్ఞానశక్తి. అప్పుడు ఎలా చేస్తే ఫలితం వస్తుందో ఆలా చేసుకుంటాడు మానవుడు. అదే క్రియాశక్తి.
ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిల సమాహారమే దక్షత అంటే.

కాబట్టి దక్షతతో అందరమూ కూడా మన యొక్క జీవన లక్ష్యాలను సాధించుకునే ప్రయత్నము చేద్దాము.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy