Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

ప్రాతఃకాలం మేలుకోవడం

Dharma Vaani – K C Das Memorial Charitable Trust

మన దైనందిన జీవనము నిద్ర లేవటంతో ప్రారంభం అవుతుంది. సనాతన ధర్మమును అనుసరించి మనము ‘తెల్లవారుఝామున (బ్రహ్మీముహూర్త సమయములో)’ నిద్ర లేవటం సదాచారం అని ధర్మశాస్త్రాలు, పురాణాలు పేర్కొంటున్నాయి.

సాధారణముగా మనకి అర్థరాత్రి దాటిన తరువాత మంచి నిద్ర పడుతుంది. అందువల్ల మనము తెల్లవారుఝాము సమయములో గాఢ నిద్రలో ఉంటాము. ఆ సమయములో నిద్ర నుండి మేలుకోవాలంటే మనకి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, హాయిగా పడుకుంటే బాగుంటుంది కదా అని మనకి అనిపిస్తుంది. ‘తెల్లవారుజామున నిద్ర లేవటం కష్టం’ అనే భావన మనకు తొలగిపోవాలంటే, మనము ఆ సమయానికి ఉండే విశిష్టతని గురించి తెలుసుకోవాలి. ఋషులు మనకి ‘తెల్లవారుఝాము సమయములో నిద్ర లేవాలి’ అని ఎందుకు చెప్పారో ఒక్కసారి పరిశీలించుకుందాము, తెలుసుకుందాము, ఒకవేళ ఆచరణయోగ్యమనిపిస్తే ఆచరిద్దాము.

మనము ఒక్కసారి కాలవిభజనను గమనిస్తే, ‘సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం’ వరకు పగలు అని, ‘సూర్యాస్తమయం నుండి సూర్యోదయం’ వరకు రాత్రి అని పేర్కొంటాము. మనము చేసే దైనందిన కార్యక్రమాలన్నీ కూడా సూర్యుడి గమనాన్ని అనుసరించి సాగుతాయి. పగటి కాలములో మన దైనందిన కార్యక్రమాలన్నీ పూర్తిచేసుకొని, రాత్రి కాలములో నిద్రిస్తే, మరల మరునాడు ఉదయానికి నూతన ఉత్సహాముతో, తేజస్సుతో మన పనులను చేసుకోగలుగుతాము. ఇది ప్రకృతి ఏర్పరిచిన క్రమం. ఈ క్రమాన్ని జీవగడియారం (ఆంగ్లములో ‘బయలాజికల్ సైకిల్’) అంటాము. మన ఆరోగ్యానికి ఈ జీవగడియారం ఎంతో ముఖ్యమైనది.

ఇప్పుడు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తే మనకి విశేషమైన ఫలితం లభిస్తుంది అని సనాతన ధర్మం పేర్కొంటోంది. ఎందువల్ల? మనము “సుప్రభాత వేళ, సుప్రభాతము”, అనే మాటల్ని తరుచు వింటుంటాము. ఈ పదానికి అర్థం ఒక్కసారి గమనిద్దాము. ‘భ’ అంటే ‘కాంతి’, ‘తం’ అంటే ఆ యొక్క’, ‘భాతం’ అంటే ‘దాని నుంచి వచ్చే కాంతి, వెలుగు, జ్యోతి ప్రకాశం, సూర్యకాంతి’ అని అర్థం. ‘ ‘ప్ర’ అంటే ‘ముందు’, ‘ప్రభాతము’ అంటే ‘సూర్యకాంతి రావటానికి ముందు ఉండే సమయము’ అని అర్థము. ‘సు’ అంటే ‘మంచి సమయము’, ‘సుప్రభాతము’ అంటే ‘సూర్యకాంతి రావటానికి ముందు ఉండే మంచి సమయము’ అని అర్థము. ‘ప్రదోషము’, అంటే ‘ఆ కాంతి రావటానికి ముందు’.

ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు తాను ఉదయించటంతోనే అప్పటివరకు ఉన్న చీకటిని తొలగిస్తాడు. చీకటి అజ్ఞానానికి ప్రతీక, వెలుగు జ్ఞానానికి ప్రతీక. సూర్యోదయానికి ముందు ఉండే 90 నిముషాల సమయాన్ని ‘సుప్రభాత సమయము’ అంటాము. దీన్నే ‘బ్రాహ్మి ముహూర్త’ సమయము అంటాము. ఉదాహరణకు 6 గంటలకు సూర్యోదయం అయితే 4.30 నుండి ‘బ్రాహ్మి ముహూర్త’ సమయము ప్రారంభం అవుతుంది.

‘బ్రాహ్మి’ అంటే ‘సరస్వతి స్వరూపము’. సరస్వతి అంటే జ్ఞానము. ‘బ్రాహ్మి ముహూర్తము’ జ్ఞాన సముపార్జనకు అనువైన సమయం. అందుకనే పెద్దలు పిలల్లను తెల్లవారుజామునే లేచి చదువుకొమ్మని, ఆ సమయములో చదివితే బాగా విషయం బాగా గుర్తుంటుందని చెప్తారు. కాబట్టి ప్రాతః కాలములో సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి, కాలకృత్యములు తీర్చుకొని, మన పనులను ఆరంభించాలి. ఎందుకని? ఈశ్వరుడైన సూర్యపరమాత్మ రాబోతున్నాడు కావున, ఒక గృహస్తుగా, ఒక బ్రహ్మచారిగా, జీవం పొందిన మానవుడిగా ఆ ఈశ్వరుడిని ఆహ్వానించటానికి సిద్ధముగా ఉండాలి.

బ్రహ్మముహూర్త కాలం పరమ యోగ్యమైన కాలము. బ్రాహ్మిముహూర్త సమయములో చేసే అనుష్ఠానాదులన్నీ కూడా ఆ సరస్వతి మాత దయవలన, కరుణ కటాక్షములతో తప్పక సిద్ధిస్తాయి. సూర్యుడు ఉదయించే ఆ సమయములో నిద్రించే వారు తమోగుణ బద్దులైనవారు. సత్య, రాజో, తమో గుణాలలో ఉత్తమమైనది సత్వగుణము. మనమందరం తమోగుణాన్ని, రజోగుణాన్ని వదిలివేసి సత్వగుణాన్ని అలవర్చుకోవాలి. కాబట్టి తమో గుణాన్ని వదిలివేసి, సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి, ఆ సమయములో ఏ ఏ అనుష్ఠానాదులు చేపట్టినా తప్పక సిద్ధిస్తుంది. ఆ కాలానికి ఉండే విశిష్టత అటువంటిది.

కాలానికి ఉండే విశేషమైన మహిమ అది. ఉదాహరణకి ఒక వివాహానికి వెళ్ళాము అనుకోండి. అక్కడి వాతావరణం ఎంత శోభాయమానంగా ఉంటుంది. మంగళ ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి, వేద మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ సమయములో అప్రయత్నముగానే మనస్సుకు సంతోషముగా అనిపిస్తోంది, ఆ కార్యక్రముములో మనము కూడా అప్రయత్నముగానే పాల్గొంటాము. అలాగే సూర్యోదయానికి పూర్వం ఉండే 90 నిముషాల సమయము కూడా అత్యంత విలువైనది అని మహర్షులు గుర్తించి మనకందించారు.

మనము ఏది సాధన చెయ్యాలన్నా కూడా (విద్య, వేదము, సంగీతం ఇత్యాదివి) ఆ సమయము అందుకు అనువైనది, తేలికగా మనస్సు పట్టుకుంటుంది. ఈ విలువైనటువంటి కాలములో ఎటువంటి ఉద్విగ్నతకు లోను కాకుండా నిర్మలమైన మనస్సుతో మనము ఉండగలము. కావున ఆ సమయములో సాధన చాలా సులభము.

సూర్యోదయానికి ముందు ఉండే 90 నిముషాల సమయము మనకి ఎంతో విశేషమైన ఫలితాన్ని చాలా సునాయాసముగా అందిస్తుంది. మనమందరం కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, స్నానం చేసి, సంధ్యావందనాది నిత్యకర్మలను ఆచరించి, ఆ భగవంతుని కృపకు పాత్రులమవుదాము.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy