Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

ఆచారాలు 

Dharma Vaani – K C Das Memorial Charitable Trust

ఆచారము, ఆచార విశిష్టతను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనము సనాతన ధర్మములో ‘ఆచారము’, ‘సదాచారం’ అనే మాటలు వింటూ ఉంటాము. ఆచారము అంటే ‘చాదస్తము, మూఢత్వము’ అని కొందరు భావిస్తారు, కానీ ఇది పూర్తిగా తప్పే. ఆచారాల అంతరార్థం, విశిష్టత గురించి తెలియనివారు మాత్రమే చేసే వ్యాఖ్యానం ఇది. మన పెద్దలు మన క్షేమం కోసం ఏర్పరిచినవే ఆచారాలు. మనము ఆచారాల వెనుక ఉన్న విశిష్టతను తెలుసుకొని, వాటిలోని అంతరార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.

శాస్త్రాలన్నింటికంటే ఆచారం శ్రేష్ఠమైంది. ఆచార విశిష్టతను గురించి అనేక శాస్త్రాల్లో, పురాణాల్లో చెప్పబడింది. “ఆచార హీనం నపునంతి వేదాః” అని ఆర్షవాక్యం. “ఆచారహీనున్ని వేదాలు కూడా పవిత్రున్ని చేయలేవు” అని అర్థం. ఆచారములను పాటించని వారిని శాస్త్రాలు కూడా బాగుపరచలేవు.

మనము ఆచరించే కొన్ని పాపాలకు శాస్త్రాలు పరిహారం సూచిస్తాయి,కానీ ఆచారవిహీనుడు చేసే పాపాలకు మాత్రం శాస్త్రములో ఏ పరిహారము ఉండదు. మనము మన జీవితములో పుణ్యములు, పాపములు చేస్తూ ఉంటాము. మనము చేసే పాపాలను ప్రక్షాళన చేసుకోవటానికి మహర్షులు ‘ప్రాయశ్చిత్త కర్మలను’ మనకందించారు. అయితే, ప్రాయశ్చిత్త కర్మలు అన్ని పాపాలకు ఉండవు, కొన్నిటికి మాత్రమే ఉంటాయి (ప్రాయశ్చిత్త కర్మలు అతికష్టమైనవి). కొన్ని పాపాలకు ఎటువంటి ప్రాయశ్చిత్తం ఉండదు, ఆ పాప ఫలితాన్ని అనుభవించి పోగొట్టుకోవాల్సినదే. ఆచారాన్ని పాటించని వారు చేసే పాపాలకు ఏ ప్రాయశ్చిత్తము ఉండదు, వారిని వేదాలు కూడా రక్షించలేవు అని ధర్మశాస్త్రం మనకి వివరిస్తోంది.

అసలు ఆచారము అంటే ఏమిటి? ఆచారనీయమైన దానిని ఆచారము అంటారు. ‘ఆ చరతి ఇతి ఆచారః’, అంటే ఆ విధంగా నడుచుకోవటం, అలా కదలటం ఆచారము. వేదాలు ఏమి చెప్పాయో ఆ విధంగా నడుచుకోవటం, సత్పురుషులు ఏమి ఆచరించారో అది ఆచరించటం ఆచారము. ‘ఆచారము’ అంటే ఒక సంఘములోని సభ్యుల్లో సాంప్రదాయకంగా ఉన్న, ప్రామాణికమైన ప్రవర్తనా పద్దతి. ఒక వ్యక్తి ఒక పనిని నిత్యం చేస్తే, అది ‘అలవాటు’. అదే జాతి పరంగానో, సంఘపరంగానో చేస్తే, అది ‘ఆచారం’ అవుతుంది. ‘సదాచారం’ (సత్ + ఆచారము) అంటే సత్పురుషుల యొక్క నడవడిక, మంచి ఆచారము అని అర్థం.

మహర్షులు, బుద్ధిమంతులు, మేధావులు, పండితులు, ధర్మవేత్తలు, ఆగమకోవిదులు ఇత్యాదివారందరు ఎంతో తర్కించి, ఆలోచించి మనిషి మహోన్నతుడుగా మారటానికి అవసరమైన విధానాల్ని ఆచారాలుగా రూపొందించటం జరిగింది.అనాదిగా మన పెద్దల నుండి మనకు వచ్చిన ఆచారములు, సంప్రదాయములు ఇత్యాదివన్నీ కూడా ద్వాపర యుగము నాటి కాలము నుండి ఉన్నవని ఒక నమ్మకం. శ్రీరాముడి కాలములో లేదా అంతకు పూర్వ యుగములలో ధర్మం యొక్క ప్రసక్తి మాత్రమే ప్రధానముగా ఉండేది.

సదాచారపాలనతో మనకు ఆయుస్సు, ఆరోగ్యము లభిస్తుంది. మానవుడి జీవితానికి కేవలం ధనసంపాదన మాత్రమే పరిపూర్ణ ఆనందం ఇవ్వలేదు, మానసికసంపద (mental health, emotional health, physical health , financial health, balance of life ) ఉంటేనే మానసిక ఆనందం పొందగలుగుతాము. ఆచారములతో మనము ఆ మానసికసంపదను పొందగలుగుతాము. మానసిక ఆనందం ఉండాలి అంటే, దురాచారానికి దూరముగా ఉండాలి అంటే మన నడవడిక ఎలా ఉండాలి అని తెలిపేవే ఆచారాలు.

అయితే కాలగమనంలో ఆచారాల పేరిట కొన్ని దురాచారాలు రావటం దురదృష్టకరం. మనుష్యుల యొక్క వృత్తిని బట్టి, ప్రవృత్తిని బట్టి ఆచారాలు నియమించటం జరిగింది. సనాతన ధర్మాన్ని అనుసరించి నాలుగు వర్ణములు ఉండేవి. ఒక్కొక్క వర్ణానికి వేరు వేరు ఆచారాలు ఉండేవి. కాలక్రమములో అవి అనేక మార్పులకు లోనైనాయి. ఆచారాలను మనము సరిగా అర్థం చేసుకోవాలి. మనిషిని సరైన మార్గములో పెట్టె కట్టుబాటే ఆచారము. ఆ కట్టుబాటు మనిషి శారీరిక, మానసిక ఉన్నతికి తోడ్పడుతుంది అని మనము గ్రహించాలి.

ఉదాహరణకి పూర్వపు రోజులలో బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు, చేతులు కడుకోవటానికి చెంబుతో నీరు ఇచ్చేవారు, తుడుచుకోవటానికి తువ్వాలు ఇచ్చేవారు. అంటే బయట నుంచి వచ్చినపుడు మన కాళ్ళకు, చేతులకు దుమ్ము అంటుకొని ఉంటుంది కనుక, ఆ దుమ్మును తొలగించుకొని, శరీరాన్ని శుభ్రపరచుకోవటానికి ఈ ఆచారాన్ని పాటించేవారు. ఆలా ప్రతి ఆచారం వెనుక మర్మములు, సూక్ష్మములు చాలా ఉన్నాయి.

మన క్షేమము కొరకు వాటిని పెట్టినట్లుగా భావించి, ఆచారాలను ఆచరిస్తూ మన జీవనాన్ని గడుపుకుందాము.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy