హనుమత్ ఉపాసన విశిష్టత
‘మనోజవం మారుత తుల్య వేగం’, అని మనము హనుమను కీర్తిస్తాము. అంటే గాలి ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా ప్రయాణం చేయగల సమగ్రత కలిగినటువంటి వాడు హనుమ. అందుకు ఒక ఉదాహరణ మనకు యుద్ధకాండలో కనిపిస్తుంది. యుద్ధ సమయములో ఒకసారి రావణుడు శక్తి అస్త్రం వేసాడు లక్ష్మణుడు మీద. లక్ష్మణుడు మూర్చబోయాడు. అక్కడ ఉన్నటువంటి వైద్యులు వచ్చి చెప్పారు, ‘సంజీవిని పర్వతం అని హిమాలయాల్లో ఉంటుంది, తెల్లారి దాన్ని తీసుకురావాలి, అక్కడ మృత సంజీవిని మూలికలు ఉంటాయి, అవి తీసుకొస్తే ఇన్ని బ్రతికిద్దాం’, అన్నారు. ‘ఎప్పుడో తీసుకొస్తారు’, అంటే కుదరదు. అప్పటికప్పుడు వెళ్లి తీసుకురావాలి. ఎంత వేగంగా వెళ్లారు అంటే ఈయన, చెప్పడం ఆలస్యం ఆయన లేరు, అక్కడ హనుమంతుల వారు లేరు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సంజీవి పర్వతం మీద అవి ఏ వైపు ఎలా ఉన్నాయో అది తెలియలా హనుమకు. వెంటనే ఆ పర్వతాన్ని తగిలించుకొని తీసుకొని వచ్చారు.
తమిళనాడులో మనకి నామగిరి క్షేత్రం కనబడుతుంది అక్కడ హనుమత్ దేవాలయం ఉంది. అక్కడ స్థానికంగా ఒక కథ చెపుతారు. ఇది పరాశరసంహితలో ఉన్నటువంటి విషయం. మనకి వాల్మీకి రామాయణంలో లేదు. అమ్మవారు లక్ష్మీ రూపంలో వచ్చి అక్కడ నిలబడి, ఈయనకి సాయంకాల సమయం అయితే అప్పుడు ‘సంధ్యావందన సమయం అయింది’, అన్నారు. సంధ్యావందన సమయం అవుతున్నది కాబట్టి సంధ్యావందనం చేయాలి కాబట్టి అక్కడ ఆ పర్వతం అక్కడ పెట్టారని, ఇప్పుడు అది నామగిరి పర్వతం అయిందని కథ. నిజానికి వాల్మీకి రామాయణంలో లేని వేరే అంశాలు కొన్ని వేరే చోట ఉంటాయి.
హనుమంతుల వారు సంజీవిని తీసుకొని వచ్చి వెంటనే అక్కడ అందిస్తే మళ్ళీ లక్ష్మణుడు మూర్ఛ నుంచి మేలుకున్నాడు. సాక్షాత్ శ్రీరాముడికి, లక్ష్మణుడికి ఉపకారం చేసినవారు హనుమ. మానవుడికి ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని కష్టాలు అనుభవిస్తూ అలా నడిచినటువంటి వ్యక్తి రాములవారు. రాముడికి తోడుగా ఆంజనేయ స్వామి ఉన్నారు. హనుమంతుల వారికి సీతమ్మ వారు వరం ఇచ్చారు. లంకలో ఎప్పుడైతే ఆయన సీతమ్మ వారిని చూసి రాముడు క్షేమ సమాచారం చెప్పినందుకు అమ్మవారు Return Gift ఇచ్చింది. ఏమిటది అంటే, “నిన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి నీ వల్ల అష్టసిద్ధులు కలుగుతాయి” అని. ఆయనకి అంతకు ముందే ఉన్నాయి. ఆయనకు అమ్మవారు ఇచ్చింది కాదు, ఆయనకు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి ఇవ్వగలరు.
“బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతా అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్”, అనేవే ఆ అష్టసిద్ధులు. “అణిమ మహిమ గరిమ ప్రాప్తి”, వస్తాయా అంటే అవి కూడా వస్తాయి, అంతవరకు మనము సాధన చేస్తూ ఉండాలి. సాధన మార్గంలో మనిషి మొదలు పెట్టగానే అండి ఈ కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక Department ఉన్నది. ఆ Department పేరు కలి Department. ఆ కలి Department లో Recruitments ఎక్కువ, ధర్మానుష్టాన Department లో తక్కువ, దాంట్లో చాలా మంది ఉన్నారు. Income టాక్స్ ఆఫీసర్లు వస్తారో రారో కానీ వీళ్ళు మాత్రం ముందు వచ్చేస్తారు. అలా వచ్చి ధర్మం నుంచి ఎలా పక్కకు తప్పించాలా అని చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళంతా ధర్మ విద్రోహులు, ధర్మ విరోధులు. కలిని దూరం చేయాలి అంటే హనుమంతుని పాదాలు పట్టుకోవాలి.
హనుమంతుని పాదాలు పట్టుకున్నాం అంటే మన జోలికి కలి రాడు, కలిపురుషుడిని మనం దూరం చేసుకోవచ్చు.
హనుమంతుని యొక్క లక్షణాలు చూస్తే మనం Humility, ఆయనకు ఉన్నటువంటి Humbleness.
“జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః – రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః | దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః – హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః || న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ – శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః | అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం – సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||”, అని ఆయన స్వయంగా చెప్పారు.
“వెయ్యి మంది రావణులు వచ్చినా నన్ను ఏమి చేయలేరు. కొండలు, రాళ్లు అన్ని వేసి చంపేస్తాను అందరిని. వేల మందిని నా పాదాలకి నేను నొక్కి చంపేస్తాను. లంకనంతా దహించి వేస్తాను. సీతమ్మ వారికి నమస్కారం చేసి ఎట్లా వచ్చానో అట్లా వెళ్ళిపోతాను. రాక్షసులందరిని సంహారం చేసి వెళ్ళిపోతాను”.
ఇంత చేయగల సమర్ధత కలిగినటువంటి వాడు “దాసోహం కౌసలేంద్రస్య, దాసోహం కౌసలేంద్రస్య’, అని మాటిమాటికి చెప్తున్నాడు ఆయన. మరి మనం ఏం చేస్తాం? ఏదో ఒక చిన్న పని చేసి (భగవంతుని విషయంలో కావచ్చు, ధర్మం విషయంలో కావచ్చు, ధార్మిక విషయాల్లో కావచ్చు) మేమే చేశాం, మేమే చేశాం అని అనుకుంటూ ఉంటాం. హనుమంతుని చూసి నేర్చుకోవాల్సింది ఆ Humbleness, ఆ Humility, ఆ Determination, ఆ Vision. ఇవన్నీ గనుక మనం అలవాటు చేసుకుంటే, ఆ వైభవాలన్నీ మనకి కూడా అందిస్తాడు.
ఎక్కడెక్కడ రాముడికి కానీ, లక్ష్మణుడుకి కానీ, సీతకు గాని, సుగ్రీవుడికి కానీ ఇబ్బంది వస్తే అక్కడక్కడ హనుమ మనకు కనిపిస్తారు. ఇందుకు సంబందించిన మరొక ఉదాహరణ చూద్దాము. యుద్ధకాండంలో మనకు వస్తుంది ఈ కథ.
ఇంద్రజిత్ ఒక అస్త్రం వేస్తే ఆ అస్త్రానికి మొత్తం సైన్యం అంతా పడిపోతుంది. ఒక విభీషణుడు మాత్రం ఉంటాడు, హనుమంతుల వారు ఉంటారు. వీళ్ళిద్దరూ రాత్రి కూడా చీకట్లో దీపం పెట్టుకొని తిరుగుతూ తిరుగుతూ ముందు ‘జాంబవంతులవారు వారు ఇక్కడ ఉన్నాడు, పెద్దాయన ఎలా ఉన్నారో చూద్దామని’, ఆయన దగ్గరికి వెళ్తారు. హనుమంతుడు వినయ సంపన్నుడు కాబట్టి ఆయన పాదాలను దగ్గర నించొని ఉన్నాడు. విభీషణుడు జాంబవంతుడి దగ్గరికి వెళ్లి, “జాంబవంతా ఎలా ఉన్నావు?”, అని అడుగుతాడు. ఆయన కళ్ళు తెరిచి, “హనుమంతుడు ఎలా ఉన్నాడు?”, అంటాడు.
విభీషణుడు ఆశ్చర్యపోయి అంటాడు, “సుగ్రీవుడు ఎలా ఉన్నాడు అని అడగాలి నువ్వు, (రాజు కదా). లక్ష్మణుడు ఎలా ఉన్నాడు అని అడగాలి. రాముడు ఎలా ఉన్నాడు అని అడగాలి. అంగదుడు ఎలా ఉన్నాడు అని అడగాలి. కానీ హనుమంతుడు ఎలా ఉన్నాడు అని అడుగుతున్నావు ఏంటి?”. అప్పుడు ఆయన అంటాడు, “హనుమ ఒక్కడు ఉంటే మిగతా అందరూ బాగుంటారు. కాబట్టి ఆయన ఉన్నాడా లేడా అని అడిగాను”. అది హనుమ విశిష్టత.
కాబట్టి హనుమత్ స్వరూపము, హనుమత్ శక్తి ఎటువంటిది అంటే మనలో ఉన్నటువంటి ‘ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన’, అనేటువంటి పంచ ప్రాణములే పంచముఖ ఆంజనేయ స్వామిగా మనం గుర్తించుకోగలిగితే, మనం వేసే ప్రతి అడుగు ధర్మం వైపే ఉంటుంది. అప్పుడు ఆయనే మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఈశ్వర స్వరూపమే హనుమత్ స్వరూపం గనుక, సుందర స్వరూపమైనటువంటి ఆంజనేయ స్వామిని మనం ఎప్పుడు మనసులో నిలబెట్టుకోవాలి. వాయుసుతుడు, పవనసుతుడు అంటుంటాం. వాయువు ఎక్కడుంది? వాయువు మనలోనే ఉంది. కాబట్టి హనుమంతుడు ఎక్కడున్నాడు అంటే మనలోనే ఉన్నాడు. ఆ స్థితికి గనుక మనం రాగలిగితే అప్పుడు మనము చేసినటువంటి పారాయణాలన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి.