గురుపౌర్ణిమ – గురుపూజోత్సవము 2026
గురుపౌర్ణమి (జూలై29) నాడు గురు నిలయంలో గురుపూజోత్సవం అత్యద్బుతముగా నిర్వహించటం జరిగింది. గురుపౌర్ణమి ఒక ప్రత్యేకమైన రోజు. ధర్మవ్యాప్తి కొరకు చేస్తున్న విశేష కృషికి మరియు మనకు, మన కుటుంబ సభ్యులకు ధర్మాచరణకు మనతో అడుగులు వేయిస్తున్న మన పూజ్య గురు దంపతిని గురుపౌర్ణమి విశేష దినమున సంస్థ సభ్యులందరు పూజించటం జరిగింది.
గురుపౌర్ణమి సందర్భముగా గురు నిలయం నందు పూజ్య గురుదంపతి గురు పరంపర యొక్క ప్రత్యేక పూజ నిర్వహించటం విశేషం. జూలై29 ఉదయం 7.30 నాడు మంగళధ్వనులతో, శంఖారావంతో గురుపూజా మహోత్సవం ప్రారంభించటం జరిగింది. ఉపాహారం అనంతరం సంస్థ సభ్యుల రుద్ర పారాయణం (నమకం), సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలను నిర్వహించటం జరిగింది.
జూలై29 ఉదయం ఉ 9.10 కు పూజ్య గురుదంపతిచే గురు పరంపరకు పూజ నిర్వహించటం జరిగింది. ఈ పూజలో సంస్థ సభ్యులు అష్టోత్తరములు పఠించగా, శక్తి సేన సభ్యులు శ్రీమతి కందిబండ పద్మ, శ్రీమతి ఆదిత్య మొదలగువారు సంస్థ ద్వారా నేర్చుకున్న మంగళహారతులు ఇవ్వటం విశేషం. పూజ అనంతరం పూజ్య గురుదేవులు సభ్యులకు తమ అనుగ్రహ భాషణాన్ని అందించారు. పూజ్య గురుదేవుల అనుగ్రహ భాషణం అనంతరం పూజ్య గురు దంపతికి సభ్యులు వందన సమర్పణ గావించారు. అనంతరం సభ్యులు పూజ్య గురుదేవుల దివ్య ఆశీస్సులను అందుకున్నారు. గురుపూజా మహోత్సవంలో భాగంగా సభ్యులకు భోజన ప్రసాదం అందించటం జరిగింది.
గురుపౌర్ణిమ సందర్భముగా పూజ్య గురుదేవుల అనుగ్రహభాషణం:


గురుపౌర్ణిమ సందర్భముగా పూజ్య గురుదేవులచే YUGAM (కె సి దాస్ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ – యువ ఉపాసకులు మరియు గాయత్రి అనుష్టాతాస్ మండలి) brochure విడుదల చెయ్యటం జరిగింది. గురు నిలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమం పూజ్య గురుదేవుల దివ్య ఆశీస్సులతో, సభ్యుల ప్రత్యక్ష, పరోక్ష సహకారముతో సుసంపన్నమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ గురువందనం చేసుకొని పూజ్య గురు దంపతి ఆశీస్సులు ప్రసాదం పొందారు. కే సి డి టి శిష్యులు అత్యంత గురుభక్తితో గురు దంపతి పాదముల వద్ద సుమారు 58000 రూపాయలను గురు కానుకగా సమర్పించుకున్నారు. పూజ్య గురువుగారు గోమాత యొక్క విశిష్టతను తెలియజేసి వెంటనే ఈ కానుకను గోశాలలకు ఖర్చు పెడతానని చెప్పారు.
ఈ పూజలో సంస్థ సభ్యులు శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శారద పీఠం,శృంగేరి నుంచి ఇవ్వబడిన ‘గురు సపర్యా’ పుస్తకమును అనుకరించారు. శ్రీ గురు నిలయంలో గురుపూజా మహోత్సవాన్ని అత్యంత భక్తి, శ్రద్ధలతో నిర్వహించిన శ్రీకందిబండ ప్రసాదరావు దంపతిని, అందుకు సహకరించిన శ్రీసేవకులను, ఆ కార్యక్రమంలో ప్రత్యక్షముగా లేదా పరోక్షముగా పాల్గొన్న సభ్యులకు పూజ్య గురుదేవులు తమ దివ్య ఆశీస్సులు అందించారు.