సామూహిక గాయత్రీ మంత్ర జపం
శ్రీ గాయత్ర్యై నమః 🙏🙏🙏
మన పూజ్య గురుదేవులు ఆచార్య శ్రీరామ్ గురూజీ గారు మరియు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారు అందించిన ఆశీస్సులతో, పవిత్రమైన శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని, విశ్వకల్యాణం మరియు సర్వలోక శ్రేయస్సు కోసం సామూహిక గాయత్రీ జప కార్యక్రమాన్ని నాలుగు ఆదివారాలు నిర్వహించుటకు నిర్ణయించబడినది.
సామూహికంగా గాయత్రీ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయని పెద్దలు తెలియజేశారు. ముఖ్యంగా దేవాలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో సామూహిక గాయత్రీ జపంలో పాల్గొనడం ద్వారా ఆ పుణ్యఫలాన్ని మనతో పాటు మన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు సమాజ శ్రేయస్సు కోసం అంకితం చేయగల అవకాశం కలుగుతుంది.
కావున, గాయత్రీ ఉపాసకులు, జపతులు తమ కుటుంబ సభ్యులు, బంధువులు మరియు స్నేహితులతో కలిసి ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొని, గాయత్రీ మాత అనుగ్రహాన్ని పొందవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
🌸 కార్యక్రమానికి తీసుకురావలసినవి:
- ఉదయం సంధ్యావందనం ఇంటి వద్దనే పూర్తి చేసుకొని రావలసిందిగా ప్రార్థన.
- ప్రతి ఒక్కరూ తమ ఆసనం మరియు ఆచమన పాత్ర వెంట తీసుకురావాలి.
- కార్యక్రమం అనంతరం కాఫీ అందించబడుతుంది.
🛕 కార్యక్రమ వివరాలు
వేదిక:
శ్రీ సీతారామంజనేయస్వామి దేవాలయం,
ప్రశాంతినగర్, మియాపూర్.
సమయం:
ప్రతీ ఆదివారం ఉదయం 9:00 గంటల నుండి 10:00 గంటల వరకు
తేదీలు:
🌼 16-08-2026 – ఆదివారం
🌼 23-08-2026 – ఆదివారం
🌼 30-08-2026 – ఆదివారం
🌼 06-09-2026 – ఆదివారం
ఈ పవిత్రమైన సామూహిక గాయత్రీ జప కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి అధిక సంఖ్యలో పాల్గొని, గాయత్రీ మాత కృపాకటాక్షాలకు పాత్రులు కావలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
లోకాః సమస్తాః సుఖినో భవంతు 🙏
శ్రీ గాయత్ర్యై నమః 🙏🙏🙏
ఏవైనా సందేహాలకు ఈ క్రింది సభ్యులను సంప్రదించగలరు:
సత్యనారాయణ గారు
9959225097
కృష్ణ ప్రసాద్
9603427788