భగవత్ గీత అధ్యయనం – పురుషోత్తమ ప్రాప్తి యోగం 6
శ్రీ కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ
భగవత్ గీత అధ్యయనం
ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః
శ్రీమద్భగవద్గీత – 15వ అధ్యాయం
పురుషోత్తమ ప్రాప్తి యోగం
న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః |
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ ||6||
భావం: సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ఇవేవీ నా పరం ధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్లిన పిదప, జనులు మరల ఈ భౌతిక లోకానికి తిరిగిరారు.
పరమాత్మ ధామం (నివాస స్థానం) అటువంటిది, దానిని సూర్యుడు, చంద్రుడు లేదా అగ్ని ప్రకాశింపజేయలేవు. ఆ ధామాన్ని చేరుకున్న వారికి తిరిగి జనన-మరణ చక్రంలోకి వచ్చే అవసరం ఉండదు. “యద్గత్వా న నివర్తంతే” (అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి రారు).
సూర్యుడు, చంద్రుడు లేదా అగ్ని కేవలం దృశ్యమానమైన ప్రపంచాన్ని మాత్రమే ప్రకాశింపజేయగలవు మరియు అవి తమ నిర్దిష్ట సామర్థ్యానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. మన కళ్ళు ఆ దృశ్యాలను ప్రకాశింపజేస్తాయి (చూడగలిగేలా చేస్తాయి). కంటిని ‘చిత్తం’ ప్రకాశింపజేస్తే, ఆ చిత్తాన్ని ‘ఆత్మ’ ప్రకాశింపజేస్తుంది. అలాంటప్పుడు, ఆ భౌతికమైనవి ఆత్మను లేదా భగవంతుడిని ఎలా ప్రకాశింపజేయగలవు?
జై శ్రీకృష్ణ.
ధర్మో రక్షతి రక్షితః