భగవత్ గీత అధ్యయనం – పురుషోత్తమ ప్రాప్తి యోగం 12
శ్రీ కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ
భగవత్ గీత అధ్యయనం
ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః
శ్రీమద్భగవద్గీత
15వ అధ్యాయం
పురుషోత్తమ ప్రాప్తి యోగం
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః || 13 ||
భావం: పృథ్వి యందు అంతటా ప్రవేశించి వ్యాపించి ఉండి, నేను సమస్త ప్రాణులను నా శక్తి చే పోషిస్తుంటాను. చంద్రుడిగా ఉండి, సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను.
భగవంతుడు తన శక్తితో భూమిలో ప్రవేశించి, సమస్త జీవరాశిని ధరిస్తున్నాడు. చంద్రుని రూపంలో, అందరి ప్రయోజనం మరియు వినియోగం కోసం సమస్త వృక్షసంపదను పోషిస్తున్నాడు. పరోక్షంగా, ఆయన సమస్త జీవకోటికి అవసరమైన శక్తిని మరియు సామర్థ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. శ్రీకృష్ణుడు కేవలం వసుదేవుని కుమారుడు మాత్రమే కాదని, ఆయన విశ్వవ్యాపి, జగద్రక్షకుడు మరియు జగద్భర్త అని ఈ శ్లోకం స్పష్టం చేస్తోంది. మనం ఇక్కడ అనుభవిస్తున్నదంతా మన స్వయంకృషి వల్ల కాదు, అది భగవంతుని కృప వల్లే సాధ్యమవుతోంది. భగవంతుని ప్రమేయం లేకుండా ఏ వస్తువునూ ఉత్పత్తి చేయడం కూడా సాధ్యం కాదు.
తదుపరి శ్లోకంలో, మనం స్వీకరించే ఆహారాన్ని ‘వైశ్వానరుని’ (జఠరాగ్ని) రూపంలో తానే జీర్ణం చేస్తున్నానని భగవంతుడు తెలియజేస్తున్నాడు.
జై శ్రీకృష్ణ.
ధర్మో రక్షతి రక్షితః