భగవత్ గీత అధ్యయనం – దైవాసురసంపద్విభాగ యోగః 8
శ్రీ కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ
భగవత్ గీత అధ్యయనం
ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః
::శ్రీమద్భగవద్గీత::
అథ షోడశోధ్యాయః ( పదహారవ అధ్యాయం)
దైవాసురసంపద్విభాగ యోగః
అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరం ।
అపరస్పరసంభూతం కిమన్యత్ కామహైతుకం”॥ 8 ॥
భావం: అటువంటి అసురి స్వభావం గలవారు, “ఈ జగత్తు వేద సిద్ధాంతాల మీద గానీ, ధర్మ, అధర్మ వ్యవస్థల మీద గానీ ఆధారపడలేదు, ఏ పరమాత్మచేత నియంత్రించబడలేదు, మరియు ఈ జగత్తుకు కారణం కేవలం స్త్రీపురుషుల కలయిక మాత్రమే” అని బలంగా ప్రచారం చేస్తారు. కావున జగత్తుకు మూలం కామము తప్ప మరొకటి లేనేలేదు అని భావిస్తారు.
ఇంకా ముఖ్యంగా, దాని ఉనికికి నిర్దిష్టమైన కారణం గానీ, ఆధారం గానీ లేదని వారు వాదిస్తారు.
ఇటువంటి ప్రచారం అజ్ఞానం మరియు దానిని సరైన దృక్పథంలో చూడలేకపోవడం తప్ప మరేమీ కాదు. ఇది గుడ్డివాడు ఏమీ చూడలేక, అక్కడ ఏమీ లేదని వాదించడం లాంటిది.
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో
జై శ్రీ కృష్ణ
ధర్మో రక్షతి రక్షితః