భగవత్ గీత అధ్యయనం – అర్జున విషాద యోగం 4
శ్రీ కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ
భగవత్ గీత అధ్యయనం
ఓం శ్రీపరమాత్మనే నమః
::భగవద్గీత::
అథ ప్రథమోఽధ్యాయః |
అధ్యాయం 1
అర్జున విషాద యోగం
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి ।
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ।। 4 ।।
ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ ।
పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ।। 5 ।।
యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ।
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ।। 6 ।।
పాండవ పక్షాన ఉన్న ఆ యోధుల పేర్లు: యుయుధానుడు, విరాట రాజు, మహాశూరుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, మహా పరాక్రమశాలి అయిన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడైన శైబ్యుడు, యుధామన్యుడు, మహా పరాక్రమశాలి అయిన ఉత్తరుని కుమారుడు అభిమన్యుడు మరియు ఉపపాండవులు. వీరందరూ భీముడు మరియు అర్జునులతో సమానంగా పోరాడగల సామర్థ్యం కలిగిన యోధులు.
ఆ యోధుల సామర్థ్యం మరియు నైపుణ్యం ద్రోణాచార్యునికి బాగా తెలుసు. ఇంతకు ముందే ఈ యోధుల పేర్లను ప్రస్తావించకపోవడానికి గల కారణాలు ఇవి కావచ్చు:
• ఆచార్యునిలో ఆవేశాన్ని లేదా పోరాట పటిమను ప్రేరేపించడం.
• తన సొంత సైన్యం యొక్క పరాక్రమంపై సందేహం కలగడం.
• ఎదుటి పక్షం సైన్యం తన సైన్యం కంటే శక్తివంతమైనదేమోనని అనుమానించడం.
జై శ్రీ కృష్ణ,
ధర్మో రక్షతి రక్షితః