భగవత్ గీత అధ్యయనం – సాంఖ్య 3
శ్రీ కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ
భగవత్ గీత అధ్యయనం
ఓం శ్రీపరమాత్మనే నమః
::భగవద్గీత::
రెండవ అధ్యాయం:
సాంఖ్య యోగము
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ||” 3 ||
భావం: ఓ పార్థా, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోనుకావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లెమ్ము.
ఓ ‘పరంతపా’ (శత్రువులను కలవరపరిచి, వారికి నిద్రలేకుండా చేయగలవాడా)! నీకు ఈ పిరికితనం, అల్పమైన ఆలోచనలు, దుఃఖం ఎలా కలిగాయో నాకు అర్థం కావడం లేదు. ఇది నీ నిజ స్వభావం కాదు. ఈ మానసిక బలహీనతను వదిలిపెట్టి, లేచి నిలబడు; పోరాడటమే నీ ధర్మం. నీకున్న చింతలు, ఊహలు అన్నీ నిరాధారమైనవి, అసత్యమైనవి. నీవు అత్యంత ధైర్యవంతుడవు, శక్తిమంతుడవు మరియు అనేక ఉత్తమ గుణాలు కలిగినవాడవు. ఈ విషయం నీకు బాగా తెలిసినప్పటికీ, నీవు ఇంకా ఈ వేదన నుండి బయటపడటం లేదు.
భగవానుడు, అర్జునుడికి ఉన్న ఈ మానసిక స్థితిని (ఒక రకమైన ‘వ్యాధి’ని) గమనించి, అతనిలోని ‘పరంతప’ (శత్రువులను జయించగల) గుణాన్ని గుర్తు చేయడం ద్వారా దానికి చికిత్స చేయడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ, అర్జునుడు ఇంకా దుఃఖపూరితమైన మానసిక స్థితిలోనే ఉండి, తర్వాతి శ్లోకంలో తన ఆందోళనను మరొకసారి వ్యక్తం చేశాడు.
జై శ్రీ కృష్ణ
ధర్మో రక్షతి రక్షితః