Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

పాదసేవ మహాత్మ్యం

Dharma Vaani – K C Das Memorial Charitable Trust

కలిలో సులభముగా ముక్తిని సాధించటానికి, భగవంతుని అనుగ్రహం పొందటానికి ఎన్నో మార్గాలను, అవకాశాలను పెద్దలు మనకందించారు. కలికాలంలో భగవంతుడు చాలా తేలికగా ప్రసన్నం అవుతాడు ఎందువల్లనంటే కలి యొక్క ప్రభావం అటువంటిది కావున, మరియు మనము అన్ని విషయాలు కలికాలంలో ఆచరించలేము.

కలిని గురించి ధర్మశాస్త్రములో ఇలా పేర్కొనబడ్డది:
విష్ణుం శివం వా భజతాం గురోః పిత్రోశ్చ సేవినాం। గో వైష్ణవ మహాశైవ తులసీ సేవినామపి॥
నస్యాత్కలికృతో దోషః కాశ్యాం నివసతామపి। కలౌ గురూణాం భజనమీశ భక్త్యధికం స్మృతమ్ ||

“విష్ణువునుగానీ, శివుని గానీ భజించుట, గురువులను, తల్లిదండ్రులను సేవించుట, గోవులను, విష్ణుభక్తులను, శివభక్తులను, తులసిని సేవించుట – చేయు వారికి కలిదోషమంటదు. కాశీవాసము కూడా అట్టిదే. కలియుగంలో గురుభజన, ఈశ్వరభక్తి అధిక ప్రభావవంతమైనవి”, అని ధర్మశాస్త్ర వచనం.
పితృ శబ్దానికి తలితండ్రులు అని అర్థం. విష్ణువు పూజ గాని, శివుని పూజ గాని, తలితండ్రుల పూజ గాని విశేషమైనవి. భగవత్ సేవ చెయ్యగలిగితే విశేషముగా నోములు, వ్రతాలు ఇత్యాదివి చేసుకోవచ్చు. అది లేని పక్షములో ఇంట్లో ఉన్న తలితండ్రులకు నమస్కరించినా అదే పుణ్యం లభిస్తుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు అంటుంటాము అందువల్ల గురువుగారిని పూజించినా అదే ఫలితం వస్తుంది.

గోవు ఎక్కడ కనపడినా నమస్కరించాలి అంటారు. ఈ పద్నాలుగు భువనాలు కూడా ఆవు యొక్క అన్ని అంగాల్లో ఉన్నాయి అని శాస్త్రం పేర్కొంటోంది. విష్ణుతత్వముగా ఉంటుంది గోవు. గోవుకు నమస్కరిస్తే విశేషమైన పుణ్యం. కలిలో చేసిన దోషాలను పోగొట్టుకోవడానికి ఇవ్వని కూడా మార్గాలు. ఈశ్వరుడికి భక్తితో నమస్కరిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో. అదే ఫలితాలు వీటన్నిటికీ కూడా చెప్పారు.
ఇలాగే పోతన మహాత్యుడు ఒక మాట అంటారు, “నీ పాద కమల సేవయు , నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం తాపార భూత దయయను, తాపస మందార నాకు దయసేయగదే”, అంటే ‘భగవంతుడికి పూజ చెయ్యటం, భగవంతుడి పాదాలను అర్చించటం, భగవద్ భక్తుల యందు పూజ్య భావం కలిగి ఉండటం విశేషమైన పుణ్యం కలిలో.’

కలిలో దోషాలు చాలా ఉంటాయి. అయితే ఆ దోషాలు పోవటానికి అతి తేలిక మార్గాలు కూడా ఎన్నో పెద్దలు మనకందించారు. తరిణోపాయం ఏమిటి కలిలో అంటే తలితండ్రులకు నమస్కరించటం, గోవును పూజించటం, తులసినీ పూజించటం (స్నానం చేసిన తరువాత తులసికి మనస్కరించటం), శివుడిని, విష్ణువు పూజించటం చేస్తే కలిదోషము తొలగిపోతుంది అని ధర్మసింధు మనకి తెలియజేస్తున్నది. కావున అందరు కూడా వీటిలో కొన్నిటినైనా ఆచరించాలని ఆశిస్తున్నాము.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy