Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

భయములు

Dharma Vaani – K C Das Memorial Charitable Trust

మనము కొన్ని భయాలను గురించి తెలుసుకుందాము. మానవుడు దేనికి భయపడుతూ ఉంటాడు, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి.

భోగే రోగభయం, కులే చ్యుతిభయం, విత్తేనృపాలాద్భయం,
మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం,
శాస్త్రే వాద భయం, గుణేఖల భయం, కాయే కృతాన్తాద్భయం,
సర్వం వస్తు భయాన్వితం భువినృణాం, వైరాగ్యమేవాభయం

భోగాలను అనుభవించేవాడికి రోగాలు వస్తాయని భయం, డబ్బు బాగా ఉన్నవాడికి దొంగల భయం, రాజుల భయం, ప్రభుత్వ భయం, బలవంతుడికి శత్రువుల భయం, రూపవంతులకు వృదప్యము భయం, శాస్త్ర పాండిత్యం ఉన్నవాడికి విమర్శకులతో భయం, విద్య ఉన్నవాడికి వాదనలతో ఓడిపోతాను అన్న భయం, మంచివారికి చెడ్డవారితో భయం. ప్రతి మనిషి భయపడేది మృతువుకి, యమధర్మరాజుకు, మృత్యుభయం, ప్రాణభయం, యమభయం అందరికి ఉంటుంది. మృతువు నిరంతరం మనవెంటే ఉంటుంది.ఆ భయం నిరంతరముగా వదిలిపెట్టకుండా ఉంటుంది.

ఏ భయము లేకుండా “చిదానంద రూపం శివోహం శివోహం” అనుకోగలిగితే, నిరంతరం ఆనందంలో ఉండగలిగేటువంటి మనః ప్రవృత్తిని గనుక మనము అలవాటు చేసుకోగలిగితే, మనస్సును గనుక ఆ విధముగా నచ్చచెప్పగలిగితే, ఇక్కడున్నదంతా క్షణికము, తామరాకు మీద నీటి బొట్టు వంటిది, అనే ఉదాహరణలు మనకు పెద్దలు అందువలనే ఇస్తున్నారు. అది ఎప్పటికప్పుడు మనము గుర్తుంచుకోగలిగితే మనస్సుకు వైరాగ్యము అనే భావము బాగా పట్టుకుంటుంది. అది పట్టిందంటే ఇక నిర్భయుడై ఉంటాడు, “స్వాగతమయ్యా యమధర్మరాజా”, అని యముడిని కూడా స్వాగతిస్తాడు. ఆ మాయ తెర తొలగిపోతుంది.

భయం లేకుండా ఉండాలంటే వైరాగ్యం అలవాటు అవ్వాలి, ఆలా అవ్వాలి అంటే భగవంతుడి పదాలు పట్టుకోవాలి. భగవంతుడి సేవ, భగవంతుడి పాదాలు పెట్టుకోవాలంటే అందిరివల్ల అయ్యేది కాదు. అటువంటప్పుడు ఏమి చెప్పారు, ధర్మాన్ని కనుక ఆశ్రయించి ఉంటే, ధర్మపదంలో, ధర్మమార్గములో మనము నడుస్తూ ఉంటే, ధర్మో రక్షతి రక్షితః గనుక, ఆ ధర్మంలో ఉన్నటువంటి వాడిని కాపాడే భాద్యత భగవంతుడు తీసుకుంటాడు కనుక, నిర్భయముగా నీ జీవితాన్ని గడుపుకోవచ్చు.

కాబట్టి నిరంతరం ధర్మానుచరణ చేస్తూ ఉందాం, ధర్మానుచరనే ఆయుధముగా కలిగి ఉందాము.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy