ధర్మవాణి
పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారు ధర్మవాణి శీర్షికన ‘సెప్టెంబర్ 2020 నుండి మార్చ్ 13 2022 వరకు’ ప్రతి రోజు ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను మనందరితో పంచుకోవటం జరిగింది. ధర్మవాణిలో మన గురువుగారు ఆచారాలను, వ్యక్తిత్వ వికాసానికి మనము అలవర్చుకోవాల్సిన లక్షణాలను, పండగల విశిష్టతను, పురాణాలను, మాసాల విశిష్టతను, ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను మనందరికి అందించారు.
మన వ్యక్తిత్వాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, మనల్ని బలహీనపరిచే లక్షణాలైన కోపము, మోహము ఇత్యాది వాటిని మనము ఎలా నియంత్రించుకోగలమో, ఉత్తమ లక్షణాలైన క్షమాగుణం ఇత్యాదివి ఎలా అలవర్చుకోగలమో పూజ్య గురుదేవులు తమ అనుగ్రహభాషణల ద్వారా అద్భుతముగా వివరించారు.
పూజ్య గురుదేవులు ధర్మవాణిలో పేర్కొన్న అనేక అంశాలకు అక్షర రూపం.