అంటూ, ఎంగిలి మూఢనమ్మకాలా, నిజామా?
మనకి సాంప్రదాయంలో కొన్ని పదాలు చాలా ముఖ్యంగా పూర్వంలో మన వాళ్ళు మన పెద్దలు, పూర్వీకులు అందరూ కూడా పాటిస్తూ ఉండేవారు. ఇది చాలా విశేషంగా ప్రతి ఇంట్లో ఉండేది, చాలా వరకు చాలామంది దీన్ని దృష్టిలో పెట్టుకొని పాటిస్తూ ఉండేవారు. అవేంటంటే ‘అంటు, ఎంగిలి, మడి, మైల, ముట్టు’, అనేటువంటివి. ఈ పదాలు రాను రాను మన యాంత్రిక జీవనంలో ఇమిడిపోయి అందరం వాటిని పూర్తిగా మర్చిపోవడమో, వాటిని నిర్లక్ష్యం చేయడమో, వాటి విషయం యందు అవగాహన లేకపోవడమో, ఏవైనా కారణాలు కానివ్వండి వాటిని వదిలేస్తూ ఉన్నారు.
మన పూర్వీకులు అంటే వాళ్ళు Poor వాళ్ళు Weak అనేటువంటి భావన మనకి. నిజానికి వాళ్ళు చాలా మనకన్నా చాలా విజ్ఞానవంతులు అని చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని విషయాల్లో ఆధునిక సాంకేతిక విషయాల్లో బహుశా వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. కానీ జీవన విధానము ఆనందంగా సంతోషంగా ఎలా గడుపుకోవాలో, హాయిగా వేప చెట్టు కింద నూక మంచం మీద కాలు మీద కాలేసుకొని చక్కగా నిద్రపోయినటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా. ఆ తరం అంతా కూడా ఇవాళ మనకి ఏసీ గదులు ఉన్నా, పరుపులు ఉన్నా నిద్ర పట్టని పరిస్థితి మనది.
మనం పడే మానసిక వేదన `ఆ రోజుల్లో ఉండేది కాదు. ఎందుకంటే ఇలాంటివన్నీ పట్టించుకొని కొంచెం జాగ్రత్తగా కొద్దిగా శ్రద్ధ వహిస్తే చాలు. ఈవాళ మనము అంటూ, ఎంగిలి గురించి తెలుసుకుందాం. ఈ రెండు కూడా ఆహార నియమాలలో భాగంగా ఏర్పరిచినటువంటివి. ఆహారములో పదార్థ దోషము, పాక దోషము అనే దోషాలు చెప్పారు. ఇప్పుడు మనం మామూలుగా ఒక పుచ్చిపోయిన వంకాయ అనుకోండి అది కనబడుతుంది ప్రత్యక్షంగా. మనకి భౌతికంగా కనబడుతుంది దోషం ఉంది దాంట్లో అని. అలా కాకుండా “ఆహార పదార్థాలను ఆశ్రయించుకొని ఉండేటువంటి దోషాలు ఉంటాయి నాయనా! ఆ దోషభూఈష్టమైనటువంటి ఆహారం మీరు స్వీకరిస్తే ఆ ఆహారం యొక్క ప్రభావము మీ మనసు మీద, మీరు తీసుకునే నిర్ణయాల మీద, మీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. జాగ్రత్త”, అని చెప్పారు.
ఇప్పుడు ఆహారం మనము కొన్ని పదార్థాలు వండుతాం, కొన్ని వండకుండానే తయారు చేసుకుంటాం. ఉదాహరణకి ఒక రోటి పచ్చడి ఉందనుకోండి, దాన్ని వండం, ఉడకబెట్టం, పోపు వేస్తాం. కానీ పప్పు, కూర ఇవన్నీ కూడా వండుతాం. కాబట్టి మొదట ఏంటంటే ఈ వండిన పదార్థాలు వండని పదార్థాలతో కలపకూడదు. కలిపితే అది ‘అంటూ’. ఎందుకండి ప్రశ్న? మనం మొదట వచ్చేది ఎందుకు అని కదా? ఎప్పుడైతే మనం ఆహారాన్ని వండుతామో Due To That Heat, Due To That Process మనం ఏమైతే Involve చేసామో, ఆ Process వల్ల There is a transformation that takes place. ఇక్కడేమో Untransformed గా Natural గా ఏది ఉందో అది వాడుతున్నాం. అక్కడ Transformation అయింది. so దీన్ని దాన్ని కలపకండి అన్నారు.
కలపడం అంటే మామూలుగా దీనిలో తీసి దానిలో వేయడం అని కాదు. ఒక చెంచాతో కూర తీస్తే అదే చెంచా మళ్ళీ వండని పదార్థమైనటువంటి (పొళ్ళు ఉంటాయి, ఏదో నువ్వుల పొడిని, కందిపొడిని, కారపొడిని రకరకాల పొళ్ళు చేసుకుంటాం. ఇవన్నీ ఉడకనటువంటివి) పదార్థాలు వాటికి తగిలించకూడదు. తగిలిస్తే అది పనికిరాదు. ఎందువల్ల? దీంట్లో వచ్చినటువంటి మార్పులు దాంట్లోకి వెళ్ళిపోతే అది It is Unprocessed. ఒక రకంగా చూడాలంటే దీన్ని process చేసినట్టుగా అది process చేయలేదు మనం. కాబట్టి there is a possibility that gets contaminated, basically hyjine and Health. ఈ health and hygene దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి సూత్రాలు ఇవన్నీ.
చాలా సింపుల్, ముందు మనం మానసికముగా prepare అవ్వాలి. yes this is good for me అని మనం prepare అవుతే ఇది చాలా simple. practice చేయడం ఏం లేదు, దేనికి దానికి ఒక గరిట పెట్టుకోండి లేదా ఒక చెంచా పెట్టుకోండి, దీంట్లో నుంచి వేసి దాంట్లో వేయకండి. అది కలపకండి. అది మంచిది కాదు కూడా. పప్పులో గరిట తీసి కూరలో పెట్టడం కూరలో గరిట తీసి పులుసులో పెట్టడం పనికి రాదు. పప్పుచారు చేస్తాం గనుక పప్పులో గరిట తీసి పులుసులో పెట్టొచ్చు.
అన్నం తినేటప్పుడు ఈ అన్నం వడ్డించినటువంటి పళ్ళెం (అన్నం వడ్డించగానే అంట అయిపోయింది అది), అన్నం పాత్ర వడ్డించేటువంటి గెరిట, ఈ వడ్డించినటువంటి విస్తరి గాని పాత్ర గాని కంచం గాని దేనికి దానికి seperate గా maintain చేయాలి అన్నారు. hygene గురించి ఎంత ఆలోచించారో చూడండి మన మహర్షులు, పెద్దవాళ్ళు, పూర్వీకులు. ఎందుకు అది అంటూ? ఇప్పుడు ఆ ఆ పదార్థాన్ని భుజించే అతను నోట్లో పెట్టుకొని మళ్ళీ next ముద్ద తీస్తున్నాడు. so ఎంగిలి. ఇప్పుడు అతని నోట్లో నుంచి ఎంగిలి ఆ కంచానికి అంటుతుంది. మీరు అంటును ఎంగిలితో కలపకూడదు. కాబట్టి ఇది అంటుని పాటించడము అంటే.
జాగ్రత్తగా మనం గమనిస్తే అంటూ అనేటువంటి విషయంలో basically concept is to ensure health and hygenity. hygene గా ఉండడం కోసం చెప్పినటువంటి మాటే తప్ప అది చాదస్తమని కొట్టి పారేస్తే దాని వల్ల నష్టం మనకే. కాబట్టి ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇది అంటూ అన్నారు.

ఇకపోతే ఎంగిలి. ఒకరు తిన్న పదార్థము మరొకరికి పెడితే అది ఎంగిలి. ఉపనయన సమయంలో మాతృభోజనము అనే ఒక విధానం ఉంటుంది. బ్రహ్మచారులతో కూర్చోబెట్టి, అక్క చెల్లెలు ఎవరైనా ఉంటే కూర్చోబెట్టి, అప్పుడు మాత్రం పక్కన కూర్చొని తింటారు. ‘అభోజ్య భోజన అలేహ్య లేహన అపేయాపాన ఉచిష్టాన్న భోజన..’, ఇవన్నీ కూడా దోషాలు అంటుంది. అంటే ‘తినకూడనివి తినడం, తాగకూడనివి తాగడం, ఎంగిలి అన్నం తినడం, ఒకళ్ళ ఎంగిలి తినడం’, ఇవి నిషిద్ధములు అన్నారు.
ఎందుకు? లాలాజలం నుండి bacteria త్వరగా వస్తుంది. కరోనా వచ్చినప్పుడు నోటికి గుడ్డ పెట్టుకోమన్నారు. ఎందుకు? మాట్లాడినప్పుడు వచ్చినటువంటి తుంపర్ల నుండి వచ్చినటువంటి bacteria ద్వారా జ్వరము వ్యాప్తి చెందుతుంది గనుక, ఆ వ్యాప్తి జరగకుండా ఉండడం కోసం గుడ్డ కట్టుకోమన్నారు ముక్కుకి, నోటికి. పెద్దలతో మాట్లాడేటప్పుడు చెయ్యి నోటికి అడ్డం పెట్టుకొని మాట్లాడతాం. ఎందుకు? అది పడకూడదని. వాళ్ళ మీద ఉమ్ము వేసినటువంటి పాపం తగులుతుంది. మనకు తెలియకుండానే అంత జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి వాళ్ళము ఎవరో తిన్నది, సగం తినిచ్చినటువంటిది తింటే ఆ ఎంగిలి ఈ తిన్నటువంటి వ్యక్తికి వస్తుంది ఆహారం ద్వారా. ఆ శరీరంలో ఉన్నటువంటి మలినాలు, ఆ బుద్ధిలో ఉన్నటువంటి ఆలోచనలు ఈ బుద్ధిలోకి transfer అందుకని.
భార్య భర్తల మధ్య అది దోషం లేదు అన్నారు. వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి అందులో దోషం లేదని చెప్పిన కారణం అది. మిగతా వాళ్ళని తినవద్దు అని చెప్పిన కారణం ఇది. కాకెంగిలి అని చెప్పేవారు పూర్వం. అంటే ఎప్పుడన్నా ఒకవేళ ఎవరికన్నా ఇవ్వవలసి వస్తే ఏ గుడ్డో అడ్డం పెట్టి ఆ గుడ్డలో జామపండు పెట్టి చిన్నప్పుడు కొరికి ఇచ్చేవాళ్ళం. (ప్రాణ స్నేహితుడు వాడికి ఇవ్వకుండా మనం ఎలా తింటాం) కాబట్టి కాకెంగిలి అని కనీసం ఆ జాగ్రత్త అన్నా తీసుకోండి అని చెప్పారు పెద్దలు.

కాబట్టి ఎంగిలి, అంటూ ఈ రెండు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి సూత్రాలే తప్ప ఇవి చాదస్తంతో చెప్పినటువంటివి కావు. పాశ్చాత్య జీవన విధానం వేరు, భారతీయ జీవన విధానం వేరు. గనుక ఇక్కడ విధానం అక్కడితో compare చేయడం అక్కడ విధానం ఇక్కడితో compare చేయడం రెండు correct కాదు.
మన దేశంలో వండుకునే పదార్దాలు అన్నీ కూడా ముందు ఉడకబెట్టి, ఆ తర్వాత తాలింపులు వేసుకొని, దాంట్లో అల్లం, మిరియాలు ఇటువంటివన్నీ కూడా వేసి తయారు చేస్తాం గనుక అవన్నీ పాటిద్దాం, దాని ద్వారా ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం పాటించవచ్చు.
ధర్మస్య విజయోస్తు