హనుమాన్ చాలీసా విశిష్టత
పూజ్య గురుదేవుల ప్రవచనం – హనుమాన్ చాలీసా వల్ల లభించే ప్రయోజనాలు – (10th May, 2025) – (శ్రీశ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయం, మదీనాగూడ, హైదరాబాద్)
మహానుభావులైన సంత్ తులసీదాస్ మనకందించిన విశేష హనుమాన్ స్తుతి ‘హనుమాన్ చాలీసా’. హనుమాన్ చాలీసాలో ఎన్నో బీజాక్షరాలను అంతర్లీనంగా పొందుపరిచారు తులసీదాస్. సాధారణముగా బీజాక్షరాలు, మంత్రాలు ఇత్యాదివి గురుముఖతః ఉపదేశం పొందాలి. అయితే వాటిని అందరు పొందలేరు కనుక, జనులందరు తరించటానికి హనుమత్ వైభవం, హనుమాన్ మంత్ర విశేషాలన్నిటిని దోహాల రూపములో కూర్చి హనుమాన్ చాలీసా రూపేణా మనకందించారు.
హనుమాన్ చాలీసా పారాయణ – SAFE
హనుమాన్ చాలీసా పారాయణతో మనము SAFE గా ఉండగలుగుతాము. మనలో ప్రతి ఒక్కరు కోరుకునేది, మనమందరం ఎల్లప్పుడు కోరుకునేది SAFE గా ఉండాలని.
SAFE అనే పదములో మొదటి అక్షరం S. S అంటే SUCCESS (విజయం). సక్సెస్ ఉంటే తప్ప ఆనందం ఉండదు. కానీ సక్సెస్ బదులు మనకి SORROW (బాధ, దుఃఖం) ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భములో ఈ బాధ అనేది మనలను పీడిస్తూ ఉంటుంది. ఉదాహరణలు చెప్పాలంటే బ్రహ్మచారులకు పెళ్లి కావట్లేదని, పెళ్లైన వారైతే సంతానం లేదని, తలితండ్రులైతే పిల్లలు సరిగా చదవట్లేదని, అల్లరి చేస్తున్నారని, పరీక్షలు ఎలా వ్రాస్తారో అని, వారికి ఉద్యోగం రావట్లేదని, పిల్లలకు వివాహం అవ్వట్లేదని ఇలా అనేక రకాల దుఃఖాలు. ‘మనిషి తానే కర్మ చేస్తున్నాను’, అనే అహంకారంతో అనేక దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు.
‘కానున్నది కాక మానదు, రాన్నున్నది రాక మానదు’, అని శాస్త్రం పేర్కొంటోంది. పరమాత్మ యొక్క సంకల్పాన్ని అనుసరించే అన్ని జరుగుతున్నాయి అని భావిస్తే మనకు ఏ దుఃఖము కలుగదు. మనుషులుగా పుట్టినందుకు మన ధర్మాన్ని మనము నిర్వర్తించాల్సిందే. అయితే భగవద్ అనుగ్రహము ఉన్నపుడు మాత్రమే మనము తలపెట్టిన కార్యములు విజయవంతమౌతాయి, ఆయా కార్యములలో మనకు సక్సెస్ లభిస్తుంది, మనకు ఏ భాద కలుగదు. ఆ భగవద్ అనుగ్రహం లభించటం కోసమే ఈ పరాయణాదులు, అనుష్ఠానాలు చేస్తున్నాము.
మనము sorrowness నుంచి బయటకు రావాలంటే, మనకు success లభించాలంటే, satisfaction అనే మానసిక స్థితి రావాలి. హనుమాన్ చాలీసా పరాయణతో, హనుమద్ అనుగ్రహంతో, ఆ satisfaction అనే మానసిక స్థితిని మనము పొందగలుగుతాము.
SAFE అనే పదములో రెండవ అక్షరం A. A అంటే ANXIETY (ఆందోళన, ఆత్రుత, కలవరం). ఒక ఉదాహరణ చెప్పాలంటే మన ఇంటి నుంచి బయటకు పని వెళ్లిన పిల్లలు సమయానికి తిరిగి రాకపోతే మనము ఎంతగానో ఆందోళనకు గురౌతాము. పిల్లలు సమయానికి ఎందుకు రాలేదు, పిల్లలకు ఏమైందో అని ఎంతగానో ఆందోళన చెందుతాము, నిముష నిముషానికి సమయం చూస్తూ ఉంటాము, పిల్లలతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాము. చివరకి పిల్లలు ఇంటికి వచ్చాక కానీ మన మనస్సు కుదుటపడదు.
ఆందోళన, ఆత్రుత అనే లక్షణాలు మనిషికి సహజముగా ఉండే గుణాలు. ఈ ANXIETY state నుంచి ACCEPTANCE state కు మనల్ని తీసుకువెళ్లేది హనుమాన్ చాలీసా పారాయణ. ఆ A అనేటువంటిది ఒక భరోసాగా మారుతుంది మనకు. ‘హనుమంతులవారు మనకు అండగా ఉంటారు’, అనే ఒక భరోసా మన ఆందోళనను దూరం చేస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణతో మనము దైర్యం, విశ్వాసం, నమ్మకం ఇత్యాది లక్షణాలను పెంపొందించుకోగలుగుతాము. మనము భగవంతుడిని ఆశ్రయించుకొని ఉన్నాము, ఆ స్వామి అనుగ్రహముతో నా అనుకునేవారికి ఏమి కాదు అనే భావనతో ఆందోళన లేకుండా ఆనందముగా జీవనం గడపగలుగుతాము. ఆందోళన రహితమైన జీవనమే ఆనందదాయకమైన జీవితము. A అంటే ఆందోళన అనే లక్షణాన్ని దూరం చేసి, ఆనందకరమైన జీవనాన్ని మనకందిస్తుంది హనుమాన్ చాలీసా పారాయణ.

SAFE అనే పదములో మూడవ అక్షరం F. F అంటే FEAR, FAILURE, FEAR OF FAILURE. భయం, ఓటమి భయం. జరగని దాని గురించి జరుగుతుందనే భయంలో జీవనం గడపటం. ఉదాహరణకు విద్యార్థికి పరీక్షలో విజయం సాధించలేనేమో అనే భయం. హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే FEARFUL state నుంచి FEARLESS state కు చేరుకుంటాము. హనుమద్ అనుగ్రహముతో మనము భయాన్ని వదిలి నిర్భయముగా జీవించగలుగుతాము.
SAFE అనే పదములో చివరి అక్షరం E. E అంటే EMOTION (భావోద్వేగాలు, బంధం). ప్రతి మనిషి ఒక తన నిర్ణయాలను రెండు రకాలుగా తీసుకుంటాడు. మొదటిది భావోద్వేగ పరముగా మనస్సుతో తీసుకునే నిర్ణయాలైతే, రెండవది బుద్దితో ఆలోచించి వివేకముతో తీసుకునే నిర్ణయాలు. ఉదాహరణకు పసుపు రంగు ఇష్టమైన వారు ఆ రంగు దుస్తులే ధరించటం, ఆ రంగునే తమ ఇంటికి వేయటం ఇత్యాదివి. తమకు పసుపు రంగు అంటేనే ఎందుకు ఇష్టమో వారు కూడా చెప్పలేరు, వారి మనస్సుకు ఆ రంగు నచ్చుతుంది అంతే. ఒక్కోసారి మనము తీసుకునే నిర్ణయాలు ఈ రెండిటి సమ్మేళనంతో కూడి ఉంటాయి కూడా. అయితే బుద్దితో ఆలోచన చేసి తీసుకునే నిర్ణయాలే సైరైన నిర్ణయాలు అని పెద్దలు పేర్కొంటారు. Logic Decisions are always right, Emotional decisions are wrong which we will repent later.
భావోద్వేగానికిలోనై ఏ మాత్రం ఆలోచన చేయకుండా మనస్సుతో తీసుకునే నిర్ణయాలు అంతగా సైరనవి కావు అని అనుభవంతో మన పెద్దలు చెప్పిన మాట. ఉదాహరణకు ‘నా బంధువు కాబట్టి ఆలోచించకుండా నేను నిర్ణయం తీసుకున్నాను’, అంటే ఆ తరువాత ‘నా బంధువు కాబట్టే నన్ను మోసం చేసాడు’, అని మనము బాధ పడాల్సి వస్తుంది. విషయం ఆధారముగా ఆలోచనముతో వివేకముతో మన నిర్ణయాలను తీసుకోగలగాలి. ఈ EMOTION అనేది మన మనస్సును అటు ఇటు తిప్పుతూ ఉంటుంది, నిర్ణయం తీసుకున్న తరువాత మనలను బాధ పడేలా చేస్తుంది. మనస్సును నిగ్రహించుకొని, బుద్దితో, వివేకముతో నిర్ణయాలు తీసుకునే అవకాశం హనుమాన్ చాలీసా పారాయణతో మనకు లభిస్తుంది. హనుమంతులవారి అనుగ్రహముతో, హనుమాన్ చాలీసా పారాయణతో సద్బుద్ధిని పొందగలుగుతాము తద్వారా ఆ బుద్దితో ఆలోచించి సరైన నిర్ణయాలను తీసుకొనగలుగుతాము తద్వారా ఆనందకరమైన జీవనాన్ని గడపగలుగుతాము.
‘జయ హనుమానా జ్ఞాన గుణ సాగర’, అని తులసిదాస్ హనుమను కీర్తిస్తారు హనుమాన్ చాలీసాలో. ఒక్క చిన్న వాక్యం ద్వారానే అనేక విషయాలను తులసీదాస్ మనకందించారు. హనుమంతులవారిని ధ్యానం చేస్తే, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే, జ్ఞాన గుణ రెండు మనకు లభిస్తాయి. గుణములు అంటే VIRTUES, CHARECTER (లక్షణాలు). జ్ఞానము అంటే KNOELEDGE. మనకు ఈ రెండు అవసరమే. జ్ఞానము ఉండి గుణము లేకపోయినా, గుణము ఉండి జ్ఞానము లేకపోయినా ఏ ప్రయోజనము ఉండదు. ఈ రెండు ఉంటేనే మనము జీవితములో రాణించగలుగుతాము.
హనుమాన్ చాలీసా పారాయణతో మనకు జ్ఞానము, గుణము రెండు లభిస్తాయి. ఈ జ్ఞానముతో LOGICAL DECISIONS తీసుకునే స్థితి కలుగుతుంది. దాని వల్ల మనము EMOTION STATE నుంచి ENJOYMENT STATE కు వెళ్లగలుగుతాము. E అంటే EMOTION కాకుండా ENJOYMENT అనే భావనతో మన నిర్ణయాలను తీసుకొనగలుతాము. ప్రతి DECISION లో మనము ENJOY చెయ్యగలుతాము. THERE ARE NO CHALLENGES BUT ONLY OPPURTUNITIES అంటారు పెద్దలు. ఎంతటి కష్టమైన పరిస్థిలోనైనా సరే ఏ మాత్రం బెదరకుండా, చెదరకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా వివేకముతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశం హనుమాన్ చాలీసా పారాయణతో మనకు లభిస్తోంది.
హనుమాన్ చాలీసా పారాయణ – ఆత్మజ్ఞానం
మన మానసిక స్థితిని అదుపులో పెట్టుకోగల సామర్థ్యం హనుమాన్ చాలీసా ద్వారా మనకు లభిస్తుంది. ‘జ్ఞాన గుణ సాగర’, అంటే సముద్రములో ఉన్నంత నీరు అంటే కొలవలేనంత, అపారమైన జ్ఞానము, గుణములు కలవారు హనుమంతులవారు. ఈ జ్ఞాన, గుణములను ఎవరికి ఎంత కావాలో వారికి అంత అనుగ్రహించగలరు హనుమ. సముద్రములో నుంచి ఎవరు ఎంత నీరు తీసుకున్నా సముద్రములో నీరు ఎప్పటికి తరగదు. అలాగే హనుమ కూడా జ్ఞాన గుణములను అనంతముగా కలిగి ఉండి, వాటిని తన భక్తులకు ప్రసాదించగలరు.
హనుమ మనకు ఏ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అంటే సర్వజ్ఞాన సంపన్నులు హనుమ. ఎవరికి ఏ జ్ఞానం అవసరమో, వారికి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు హనుమ. సనాతన ధర్మాన్ని అనుసరించి జ్ఞానం రెండు రకాలు మొదటికి లోకిక జ్ఞానము, రెండవది ఆధ్యాత్మిక జ్ఞానము. ప్రతి మనిషికి లోకిక జ్ఞానము అవసరమే, కానీ అంతటితో ఆగిపోకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందే దిశగా తన ప్రయాణం సాగించాలి. మనిషిగా పుట్టినందుకు ఆ భగవంతుని గురించి తెలుసుకునే ఆలోచన చెయ్యాలి, అయినను పొందే దిశగా మన ప్రయాణాన్ని సాగించాలి. కేవలముగా లోకిక వ్యవహారాలను అనుసరించి మన జీవనాన్ని సాగిస్తే అప్పుడు జంతువులకు మనకు తేడా ఉండదు. భగవంతుడు మనకు ఇచ్చిన విశేషమైన శక్తి అయిన బుద్దిని వినియోగించి ఏది ధర్మము, ఏది అధర్మము అనే ఆలోచన చేయగలగాలి తదనుమునముగా మన జీవనాన్ని గడపగలగాలి.
ఉదాహరణకు ఒక కుక్క ఎక్కడ పడితే అక్కడ, ఏ ఆహారం పడితే ఆ ఆహారం తింటుంది. కానీ మనిషి ఆలా చెయ్యకూడదు, ఆహార నియమాలు పాటిస్తూ ఆహారాన్ని స్వీకరించాలి అని ధర్మం పేర్కొంటోంది. ‘జంతూనాం నార జన్మ దుర్లభం’ అన్నారు శంకరాచార్యులు. ధర్మాన్ని అనుసరించి మన జీవనం గడిపినపుడు మాత్రమే మానవుడిగా జీవించినట్టు అని శాస్త్రం పేర్కొంటోంది. ఆలా చేయగల స్థితి హనుమాన్ చాలీసా పారాయణతో మనకు లభిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణతో లోకిక జ్ఞానముతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానము కూడా పొందగలుగుతాము.

హనుమంతులవారు ఇచ్చే విద్య ఏమిటి అంటే భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యని కూడా స్వామి హనుమ మనకు అనుగ్రహించగలరు. ‘ చదివి చదివి చదివి చావంగ నేటికి? చావులేని చదువు చదవవలయు, చదువులేక కోటి జనులు చచ్చిరికదా! విశ్వదాభిరామ వినురవేమ!’ అన్నారు వేమన కవి. ఏ చదువు చదివితే మళ్ళీ చదవవలసిన అవసరం లేకుండా ఉంటుందో, అంటే మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఉండదో, అంటే మోక్షము లభిస్తుందో, ఏ చదువు చదివితే, ఏ జ్ఞాన సముపార్జన చేస్తే ఆ స్థితి వస్తుందో, ఆ జ్ఞానాన్ని ఇచ్చే వారు హనుమంతులవారు. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే ఆ జ్ఞానం కలుగుతుంది. ఏమిటా జ్ఞానం అంటే, ఆత్మజ్ఞానం. తనను తాను తెలుసుకోగలిగిన స్థితి ఆ హనుమంతుని కృప వలన కలుగుతుంది. ఆత్మజ్ఞానం అంటే తేలికగా చెప్పాలంటే ‘బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతామ్ అజాడ్యం వాక్ పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్.’ హనుమాన్ చాలీసా పారాయణతో కలిగే ప్రయోజనాలు ఒకటి చెప్పలేము. హనుమంతులవారి అనుగ్రహానికి ఎల్లలు లేనట్లే, హనుమాన్ చాలీసా పారాయణ వల్ల లభించే ప్రయోజనాలకు కూడా ఎల్లలు లేవు. చాలా తేలికగా ఉండే పదాలతో, స్పష్టంగా ఉండే పదాలతో, తొందరగా అర్థం చేసుకోగలిగే పదాలతో ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేసి, హనుమ అనుగ్రహం కనుక మనము పొందగలిగితే ‘సంకట సే హనుమాన్ చుడావై’, ఏ కష్టం వచ్చినా తొలగిపోతుంది.