Samuhika Gayatri Japam
KCDT సామూహిక సహస్ర గాయత్రీ మంత్ర జపం – అమలాపురం – May 17, 2026

🌼శ్రీ గాయత్ర్యైనమః🌼
ఈరోజు(మే17వ తేదీ) ఉదయం అమలాపురం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో 13 మంది జపితలు సామూహిక గాయత్రీ మంత్ర జపంతో ‘శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి’ వారి అనుగ్రహం పొందారు. నేటి కార్యక్రమం, అక్షర కోటి గాయత్రీ మంత్ర జప యజ్ఞం యొక్క ప్రధాన అనుసంధానకర్త అయిన శ్రీ మిర్తిపాటి వెంకటరామయ్య గారి ఆధ్వర్యంలో జరిగింది.
లోక కళ్యాణార్థం ధర్మ రక్షణార్ధం….పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారు, మహోన్నత సంకల్పంతో ప్రారంభించిన అక్షర కోటి గాయత్రీ మంత్ర జప యజ్ఞం నందు భాగస్వాములు అవ్వడం, మనందరి సుకృతం అని మరలా తెలియజేస్తూ.
ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని, మీరు కూడా మీ ఇంటి వద్దనే ప్రతి రోజూ సంకల్ప సహితంగా గాయత్రీ జపం చేయాలనుకుంటే, 9494877171 నందు సంప్రదించ ప్రార్థన.
ధర్మస్య విజయోస్తు 🚩
kcdastrust.org