Samuhika Hanuman Chalisa Parayana
హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాల వివరాలు – May 16, 2026

మే 16వ తేదీన, మదీనాగూడ అభయ ఆంజనేయ స్వామి ఆలయములో 21 మంది భక్తులు, 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణములో పాల్గొన్నారు.
శ్రీ పల్లా భిక్షపతి గారు మరియు శ్రీ PMP శర్మ గార్ల ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఇదే మదీనాగూడ దేవాలయం నందు ద్వితీయ కోటి హనుమాన్ చాలీసా పారాయణలో భాగంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతోంది, అందరూ పాల్గొనవచ్చు. శ్రీ R సురేంద్ర దంపతులు స్వామి వారికీ ప్రసాదం సమర్పించారు. ఈ భక్తులందరికీ ఆంజనేయస్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండుగాక.