Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

భగవత్ గీత అధ్యయనం – సాంఖ్య 2

శ్రీ కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ

భగవత్ గీత అధ్యయనం
ఓం శ్రీపరమాత్మనే నమః

::భగవద్గీత::
రెండవ అధ్యాయం:
సాంఖ్య యోగము

శ్రీభగవానువాచ
“కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ |
అనార్యజుష్టమస్వర్గ్యమ్ అకీర్తికరమర్జున ||” 2 ||

భావం: శ్రీ భగవానుడు ఇట్లనెను: ప్రియమైన అర్జునా, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్త భ్రాంతి ఎట్లా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా, అపకీర్తి పాలుజేస్తుంది.

అర్జునుడు తన సహజ స్థితిని తిరిగి పొందేలా ప్రేరేపించే ప్రయత్నంలో భగవంతుడు ఇలా అంటున్నాడు:
“ప్రియ అర్జునా! అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్న తరుణంలో, నీకు ఈ మోహమూ, మాయా ఎలా ఆవహించాయి? ఒక మూర్ఖుడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఇలాంటి ప్రవర్తన పిరికివారికి, అసమర్థులకు మాత్రమే తగును. నీ ఈ వైఖరి యుద్ధంలో విజయాన్ని అందించదు, పైగా పోరాడకపోతే నీకు వీరస్వర్గం కూడా లభించదు. యుద్ధ సమయంలో నీకు ఇలాంటి అనవసరమైన వేదన ఎలా కలిగిందో నాకు ఆశ్చర్యంగా ఉంది! గతంలో నువ్వు పాల్గొన్న యుద్ధాల్లో నీ ప్రవర్తన ఇలా లేదు కదా; నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నాకు బాగా తెలుసు.”

“కశ్మలమిదమ్”– పిరికితనం, వేదన, రాగద్వేషాలు వంటివి మనస్సుకు (లేదా బుద్ధికి) పట్టే మాలిన్యాలు. శరీరానికి ఏదైనా మురికి అంటితే సబ్బు వంటి వాటితో శుభ్రం చేసుకోవచ్చు; కానీ, మనస్సులోని మాలిన్యాలను తొలగించుకోవడానికి ‘పరమార్థం’ లేదా ‘జ్ఞానం’ ఒక్కటే మార్గం.
“అనార్యజుష్టమ్”– ఈ ప్రపంచంలో మనుషులను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు:
• “ఆర్య”– పవిత్రమైన జీవితాన్ని గడిపేవారు, ధర్మ మార్గంలో నడిచేవారు, ధైర్యవంతులు, ఉత్సాహవంతులు మరియు అందరిచేత గౌరవించబడేవారు. వీరిలో ‘శుద్ధ సత్వగుణం’ ఎక్కువగా ఉంటుంది.
• “అనార్య”– అధర్మ మార్గంలో జీవించేవారు, ఇతరులకు కష్టాలు కలిగించేవారు, అజ్ఞానంలో, అంధకారంలో ఉండటానికి ఇష్టపడేవారు. వీరిలో తమోగుణం, రజోగుణం అధికంగా ఉంటాయి.

అర్జునుడు తన ‘ఆర్య’ స్వభావానికి ప్రసిద్ధుడు – ధైర్యవంతుడు, ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడిచేవాడు, ఇతరులకు సహాయపడేవాడు, తన ఇంద్రియాలను జయించినవాడు. అర్జునుడి ప్రస్తుత మానసిక స్థితి అతని సహజ స్వభావానికి విరుద్ధమని భగవంతుడు అతనికి గుర్తు చేస్తున్నాడు.

జై శ్రీకృష్ణ
ధర్మో రక్షతి రక్షితః

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy