Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

సత్సంగము

సన్మార్గము అంటే ‘సత్యమైనటువంటి మార్గంలో నడవడం’. ఏది సత్యమైనటువంటిది అంటే ‘ఏది నిత్యమో అది సత్యము’. నిత్యము అంటే ‘ఎప్పుడూ ఒకే విధంగా ఉండేటువంటిది’.

మనిషి తాను ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ అది సాధ్యపడుతున్నదా? మధ్య మధ్యలో దుఃఖపడుతున్నాడా? అని ఆలోచిస్తే, ద్వంద్వాలకు అతీతంగా ఎవరూ ఉండరు. సుఖ దుఃఖాలు రెండు కలిసే వస్తున్నాయి. సన్మార్గంలో ఎందుకు నడవటం (సత్యమైనటువంటి మార్గంలో) అంటే ‘ఎప్పుడూ సంతోషంగా ఉండడం కోసం’, అని చెప్పారు.

మన స్వామీజీలందరికి కూడా ‘ఆనందంతో’ వాళ్ళ పేరు End అవుతూ ఉంటుంది. ఉదాహరణకు చిన్మయానంద, సదాత్మానంద, నిత్యానంద, ఇట్లాగా ఆనందంతో End అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉంటూ ఉంటారు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి, సన్మార్గంలో నడవడానికి మహర్షులు మనకి అనేక సూచనలు చేశారు. సన్మార్గములో ముఖ్యమైన అంశం ‘సత్సంగము’ అన్నారు.

సత్సంగము అంటే?

సత్సంగము అంటే ‘సత్పురుషుల సాంగత్యంలో ఉండడం’. సత్పురుషుల సాంగత్యంలో ఉండడం వలన వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటున్నది, వారి మాటతీరు ఎలా ఉన్నది, వారి నడక ఎలా ఉన్నది, వారి నడత ఎలా ఉన్నది, వారి నడవడిక ఎలా ఉన్నది అని మనం కూడా గమనించుకొని, దాన్ని మనం కూడా అనుసరించి ఆచరించడానికి అవకాశం ఉంటుంది. అందువలన సత్సంగము అన్నారు.

నీతిశాస్త్రము ఒక శ్లోకం చెప్తుంది. ‘త్యజేత్ దుర్జన సాంగత్యః, భజే సాధుజన సాంగత్యః’, అంటే ‘దుర్జన సాంగత్యం ఏమన్నా ఉంటే దాన్ని వదిలి పెట్టేసేయ్, ఎప్పుడూ కూడా సజ్జన సాంగత్యమే కోరుకో’. ‘కురుపుణ్య మహోరాత్రం’, అహోరాత్రములు అంటే ‘పగలు, రాత్రి’. పగలు, రాత్రి ఎప్పుడూ కూడా పుణ్యకర్మలు ఆచరించడానికి ఆలోచిస్తూ ఉండు. పుణ్యకర్మలు అంటే ‘మంచి చేయడం’.

‘నీకు నువ్వు మంచి చేసుకుంటూ, నీ చుట్టూ ఉండే వారికి మంచి చెయ్. నీ చుట్టూ ఉండే మనుషులకే కాకుండా పశుపక్ష్యాదులకు కూడా మంచి చెయ్. ఎప్పుడు మంచిని గురించి ఆలోచిస్తూ ఉండు’. ‘కురుపుణ్య మహోరాత్రం’, అంటే మంచి లక్షణం. అది ‘స్మరేత్ నిత్య మనిత్యతామ్‌’, అంటుంది నీతిశాస్త్రం.

 అనిత్యమైనటువంటి దాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో. ఏది నిత్యము కాదు, ఏది శాశ్వతము కాదు అని గుర్తుంచుకో. ఇవాళ ఒక కష్టం వచ్చింది, ఒక దుఃఖం వచ్చింది, ఒక బాధ కలిగింది, ఒక నష్టం వచ్చింది, ఒక రోగం వచ్చింది, ఒక పీడ కలిగింది. ఇవన్నీ తొలగిపోతాయి, రేపు ఇవన్నీ మారిపోతాయి. ఒక సుఖం వస్తుంది, ఒక భోగం వస్తుంది, ఒక ఆనందం వస్తుంది, ఒక సంతోషం వస్తుంది, ఒక ఐశ్వర్యం వస్తుంది. మళ్ళీ ఎల్లుండి ఇది మళ్ళీ మారిపోయే అవకాశం ఉంటుంది.

‘ఏది నిత్యం కాదు అనేటువంటి విషయము నువ్వు గ్రహించుకుంటే’ ఎప్పుడూ ఆనందంగానే ఉంటావు. ఈ విషయం చెప్పేది ఎవరు అంటే ‘సత్సంగత్యంలో ఉంటేనే అది సాధ్యం’. అది ఎప్పటికి గుర్తుంటూ ఉంటుంది.

సత్సంగం – శంకరాచార్యుల బోధ:

శంకరాచార్యుల వారు ‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం’, అంటారు. సత్సంగంలో ఉంటే ‘నిస్సంగత్వం’ ఏర్పడుతుంది.  

సంగత్వము అంటే దానితో Attachment, నిస్సంగత్వం అంటే Detachment. ఏ వస్తువుతో అయినా, ఏ విషయంతో అయినా Detachment ఉండాలి, Attachment ఉంటే కష్టము, బాధ, రోగము, పీడ, నష్టం ఇవన్నీ కూడా కలిగేది. ఎవరితో Attachment లేదనుకోండి ఇంకేం బాధ ఉండదు మనిషికి. కానీ ఆ బాధలు కొని తెచ్చుకుంటాడు Attachments పెట్టుకొని. కాబట్టి అది లేకుండా ఉండాలి అంటే సత్సాంగత్యం లో ఉండాలి.

సత్సాంగత్యంలో ఉంటే ‘నిస్సంగత్వం’ అంటారు. ‘నిస్సంగత్వే నిర్మోహత్వం’, దాని వల్ల మోహం ఏర్పడదు, భ్రాంతిలో ఉండవు, వాస్తవం ఏమిటో తెలుసుకుంటావు, తద్వారా ఆనందంగా ఉంటావు. ఆ నిర్మోహత్వం వల్ల ‘నిశ్చలతత్వము’ అంటున్నారు.

నిశ్చలతత్వము అంటే Balance of Mind. ఇవాళ సమాజంలో ప్రతి వర్గంలో కూడా విశేషమైనటువంటి Stress, అది Employment Related కావచ్చు, విద్యార్థి దశ నుంచి ఐఐటీలో Seat రావాలని లేదా ఎంసెట్లో ర్యాంక్ కొట్టాలని, అక్కడి నుంచి మొదలుపెట్టి వృద్ధాప్యం వచ్చే వరకు ఏదో విధమైనటువంటి Stress ఉంటూనే ఉంటున్నది. మనిషికి ఈ Stress Management కి మంచి Medicine ఏమిటి అంటే ‘సత్సాంగత్యం’.

సత్సాంగత్యంలో ఉంటే ఆ సత్సాంగత్యం వల్ల Stress Fress Life Lead చేయడానికి అవకాశం కలుగుతుంది.

ఎలా కలుగుతుంది అంటే, ఏదైనా సరే అశాశ్వతము, అనిత్యము (ఇవాళ ఉన్నది రేపు ఉండదు) అనేటువంటి ఎరుక కలిగి మనిషి జీవనం గడుపుతూ ఉంటాడు. దానివల్ల వచ్చింది అని సంతోషించడు, పోయింది అని బాధపడడు. ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. రావడం, పోవడం సహజం. రావాలి గనుక వచ్చింది, పోవాలి గనుక పోతుంది. ఆ కార్యక్రమం ప్రారంభం అయింది, ఈ కార్యక్రమం ముగుస్తుంది, అది సహజం. మనిషి జీవితంలో వచ్చేవి, పోయేవన్నిటిని కూడా సహజంగా తీసుకోవడం అనేటువంటి లక్షణము సత్సంగత్యం వల్ల అలవాటు అవుతుంది.

సత్సంగం – సమయం:

సత్సంగత్యము అంటే మంచి Friendship.

Show Me Your Friends, I Will Tell Your Character అన్నాడు. మన యొక్క స్నేహితులని బట్టి మనం ఎటువంటి వాళ్ళమో చెప్పవచ్చు. కాబట్టి సత్సంగత్యము అంటే ‘సత్పురుషుల మధ్యలో నడవడం, వారి మధ్య గడపడం’. అంతేకాదు మంచి పుస్తకాలు చదవడం కూడా సత్సాంగత్యమే. మనతో పాటు ఎప్పుడూ ఒక మంచి పుస్తకాన్ని ఉంచుకోవాలి. మంచి ఆలోచనలు కలిగించేటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి ఇవాళ. (ఉదాహరణకు Self-help Books, భగవద్గీత)

ఉదాహరణకి భగవద్గీత రోజూ దగ్గర పెట్టుకొని చదవడం కూడా సత్సాంగత్యమే. అటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. మంచి పుస్తకాలతో గడపడం, మంచి సమయాన్ని సద్వినియోగం చేయడం కూడా సత్సాంగత్యమే. సత్పురుషుల మధ్య గడపగలిగితే విశేషమే, కానీ ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నప్పుడు అది ఎల్లప్పుడూ సాధ్యం కానటువంటి విషయం. కానీ ఇవాళ అనేక మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మాధ్యమాల ద్వారా సద్విషయాలను మాత్రమే గ్రహిస్తూ, దుర్విషయాలను రానీయకుండా ఉండాలి.

అంతర్జాలం (Internet) రెండు విధాలుగా వినియోగించుకోవచ్చు. Internetని ఆత్మనాశనానికి కాకుండా ఆత్మ అభ్యుదయానికి వినియోగించుకోవడం, సత్సంగత్యానికి వాడుకోవడం చేసే ప్రయత్నం చెయ్యాలి. Google Search చేసి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ఇవాళ అందుబాటులో ఉన్నాయి అవన్నీ కూడా.

సత్పురుషుల మధ్య గడపగలగడం ఎల్లప్పుడూ సాధ్యమయ్యే పని కాదు. ‘అసారే ఖలు సంసారే’, అని శంకరాచార్యుల వారు చెప్తారు. ‘సతాం సంఘో’, అంటారు ఆయన. ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నప్పుడు మనం అందరితో కలిసి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. కనుక మనకి మనం Insulate చేసుకుంటూ, సత్పురుషులతో మాత్రమే ఎక్కువ సమయాన్ని గడుపుతూ, దుర్మార్గపు ఆలోచనలు రానీయకుండా, సత్సాంగత్యంలో మన జీవితాలను గడుపుకోవాలి.

 అక్కడే మన యొక్క నిశ్చలతత్వం అనేటువంటి బుద్ధి మనకు ఉపయోగపడుతుంది. ఈ బుద్ధిని మనం వినియోగించుకొని ‘సత్సాంగత్యంలో గడపడము, సద్విషయముల యందు అనురక్తి పెంచుకోవడము, సత్చింతన చేయడము’, ఇత్యాదివి ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. సాధారణముగా మనకి ఎవరన్నా కనబడితే వాళ్ళతో మాట్లాడేటప్పుడు అనవసర విషయాలు మాట్లాడుతూ ఉంటాము.

ఈ Gossiping కాకుండా ఉపయోగపడేటువంటి విషయాలు మాట్లాడదాం. ‘ఆయనకన్నా ఉపయోగపడాలి, నాకన్నా ఉపయోగపడాలి. నేను మాట్లాడే మాట అతనికి ఉపయోగపడింది అనుకోండి అది ఎంతో Valuble Treasureగా పెట్టుకుంటారు’. మీ జీవితంలో కొన్ని జరిగే ఉంటాయి ఇలాంటివి. ‘ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చెప్పారండి, మీరు చెప్పిన సూచనలు నేను పాటించాను, చాలా ఉపయోగపడింది నాకు’, అనే కృతజ్ఞతాభావనతో మీ ముందు అతను నిలబడతాడు.

మాట్లాడే మాటలు పది మందికి ఉపయోగపడే విధంగా మనం మాట్లాడుతూ, సత్ప్రవర్తనను అలవాటు చేసుకోవడానికి కూడా ‘సత్సాంగత్యము’ ఉపయోగపడుతుంది.

శంకరాచార్యుల వారు ‘నిర్మోహత్వే నిశ్చలతత్వమని’, ఆ నిశ్చలతత్వమే ‘జీవన్ముక్తి’ అన్నారు. ఆయన చెప్పినటువంటిది మోక్షం కొరకు. కానీ జీవన విధానంలో దాన్ని మనం అన్వయించుకుంటే మన రోజువారి వ్యవహారాలలో కూడా అది ఎంతో ఉపయుక్తమైనటువంటి సూత్రం. సత్పురుషుల మధ్య ఉంటూ, వాళ్ళు చెప్పే మాటలు వింటూ, వాటిని మనం ఎంతవరకు ఆచరించగలమో అంతవరకు మనం ఆచరణలో పెడుతూ, ఎప్పటికప్పుడు దాన్ని మనం Improve చేసుకుంటూ ఉండాలి. ఆ ఆచరించినటువంటి సద్విషయముల యొక్క ఫలితాలను మాత్రమే పది మందిలో మాట్లాడుతూ, పది మందికి ఆ విషయాలను మాత్రమే చెప్తూ, అనవసరమైనటువంటి విషయాలను మనం చర్చలోకి రానీయకుండా, చర్చించకుండా ఉండగలగాలి.

మనకున్నటువంటి సమయము, మనకున్నటువంటి అవకాశము, మనకున్నటువంటి ఈ మానవ జన్మ, మన ముందు ఉన్నటువంటి సమస్యలు. ఎవరికి వాళ్ళకి Unique గానే ఉంటాయి ఈ సమస్యలన్నీ కూడా. కాబట్టి సత్సంగంలో ఉన్నందుకు మనకి ఆ సత్సంగం యొక్క విలువ ప్రతి విషయము, ప్రతి నిమిషము మనకు కనబడుతూ ఉండాలి. అందువల్ల ‘సత్పురుషుల మధ్య గడపడానికే ప్రయత్నం చేయండి’, అని చెప్తారు.

దుర్జన సాంగత్యము:

‘త్యజేత్ దుర్జన సాంగత్య’ అన్నది, అంటే దుర్జన సాంగత్యము వదులుకోవడం. దుర్జనుడు అంటే ఎవరండి? ధర్మమునందు అనురక్తి లేనటువంటి వాడు ‘దుర్జనుడు’.

ధర్మమునందు అనురక్తి కలిగి ఉండటం అంటే ఏమిటి? పరులకు ఉపయోగపడనివాడు దుర్జనుడు.

తన గురించి తాను ఆలోచించుకుంటున్నాడు, పరుల గురించి ఆలోచించడం లేదు. అటువంటి వాడి గురించి శాస్త్రం వదిలిపెట్టేయమని చెప్తున్నది. పది మందికి ఉపయోగపడేటట్టుగా మన జీవితం ఉండాలి. అంటే సత్పురుషుల మధ్యలో మనం గడుపుతూ ఉండాలి.

 మంచి విషయాలు చెప్పేటటువంటి వారు, మంచి విషయము నందు నడిచేటువంటి వారు, ధర్మమునందు భోధన చేసేటువంటి వారు, ధర్మమును ఆచరించేటువంటి వారు మన చుట్టూనే ఎందరో కనబడతారు. వాళ్ళతో మన సమయం గడుపుదాం, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుందాం, మనకు తెలిసిన విషయం వాళ్ళకి చెబుదాం, మనకు వచ్చిన సందేహాలు వాళ్ళ దగ్గర నుంచి నివృత్తి చేసుకుందాం. అది ఎవరు అనేటువంటి నిర్ణయం చేయడం కొద్దిగా సమయం పడుతుంది, కానీ పరీక్ష చేస్తే పెద్ద విషయం కాదు. అది ధర్మము నందు అనురక్తి కలిగి ఉండటం ఆంటే.

సత్సంగం – సన్మార్గం:

‘పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం’, అంటారు. పరులకు ఉపకారం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఎవరైనా సరే పుణ్య పురుషుడే. అటువంటి పుణ్య పురుషుల మధ్యలో మనం మన సమయాన్ని మనం గడపడమే ‘సత్సంగము’. సత్సంగంలో ఉంటే సన్మార్గంలో ఉన్నట్టే. సన్మార్గంలో ఉండటం అంటే సత్సంగంలో ఉండడం. కాబట్టి సన్మార్గము సత్సంగము, ఈ సత్సంగమే మన సన్మార్గానికి బాట వేస్తుంది.

సత్సంగము అనేది ఎక్కడిదక్కడ, ఎవరికి వారికి వేరుగా ఉంటుంది. మామూలుగా సత్సంగం అనగానే ఏదో భజన చేయడము, దేవాలయానికి వెళ్ళడం అనుకుంటారు. అది కూడా సత్సంగమే కాదని కాదు. కానీ అది మాత్రమే సత్సంగం కాదు. ఎక్కడైతే సద్విషయముల యందు ప్రసక్తి గాని, ప్రస్తావన గాని, ప్రబోధము గాని, ప్రచారము గాని, ప్రవర్తన గాని నడుస్తూ ఉnన్నదో అది సత్సంగం. మనం అక్కడ ఉండాలి.

ఆ సత్సంగంలో మనం పాల్గొనడం, అవకాశం ఉంటే మనం చెప్పడం లేదా మనం వినడం తద్వారా మనం ఆ విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. సత్సంగంలో మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, సత్సంగానికి మార్గాలు సుగమం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. అప్పుడు ఈ సత్సంగంలో మనము తరిస్తూ, మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా తరింపచేసే అవకాశం ఉంటుంది.

సన్మార్గంలో తరించడానికి, సన్మార్గంలో నడవడానికి తద్వారా ఉత్కృష్టమైనటువంటి భవిష్యత్తును పొందుతూ ఆనందంగా ఉండడానికి, దుఃఖం అనేటువంటిది రానీయకుండా, బాధ రానీయకుండా, కష్టం అనేటువంటిది తెలియకుండా, పీడ అనేటువంటిది వచ్చినా తొలగిపోయే విధంగా మన జీవనం మనం గడుపుకోవాలి అంటే, సుఖంగా సంతోషంగా ఆనందంగా గడపాలి అంటే ‘సత్సంగము మాత్రమే మార్గము’.

ఆదిశంకరుల బోధను ఆచరిద్దాము, ఎంతవరకు వీలైతే అంతవరకు సత్సంగంలోనే గడుపుదాం, సత్సంగ ఫలితాలను పొందుతూ ఆనందంగా మన జీవితాలు గడుపుకుందాం.                                  

ధర్మస్య విజయోస్తు

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy