శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం
KCDT సనాతన ధర్మ వారధి
పూజ్య గురు దంపతుల దివ్యాశీస్సులతో…
ఈ “పరాభవ” నామ సంవత్సరం మనలోని అహంకారాన్ని, అజ్ఞానాన్ని వీడి ఆత్మోన్నతిని సాధించే దివ్యకాలం. ఉగాది పచ్చడిలా జీవితంలోని కష్టసుఖాలను సమత్వంతో స్వీకరిద్దాం.
మా ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ధర్మం, కరుణ, కృతజ్ఞతలను ఆచరిస్తూ ప్రపంచ శాంతి సాధనలో భాగస్వాములమవుదాం. ఈ నూతన సంవత్సరం అందరికీ శాంతి, సౌభాగ్యాలను, ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదించాలని కోరుకుంటూ…
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు!
KCDT Sanatana Dharma Varadhi
Seeking the divine blessings of our revered Guru Dampathi
May the “Parabhava” Nama Samvatsara be a transformative journey where we overcome the darkness of ego and ignorance to attain spiritual heights. This Ugadi, let us embrace the New Year with a pure heart and a serene soul.
Just as the Ugadi Pachadi blends diverse flavors, let us learn to accept life’s ups and downs with equal grace. By walking the path of Dharma, compassion, gratitude and through our spiritual initiatives, let us contribute to global harmony. Wishing you all a year filled with peace, prosperity, and profound spiritual growth.
Wishing you a Blessed and Shubha Ugadi! 🌸🙏
పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారి మాటల్లో పంచాంగ శ్రవణం
తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పంచాంగం. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది. ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.