Dharma Vaaradhi e-Magazine
సర్వ చైతన్య రూపాంతాం ఆద్యం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ అని గాయత్రీ మాతని మనము ధ్యానిస్తాము. ఈ శ్లోకము అర్థము చుస్తే విశ్వవ్యాప్తంగా ఉన్న చైతన్య శక్తి వల్ల ఈ సృష్టిలో చలనం అనేది ఉంటుంది. ఆ శక్తికి మూలమైన తల్లి ,"ఆద్యాం" అన్నిటికి ముందు ఉన్న తల్లి విద్యాస్వరూపమైన తల్లి నిన్ను ధ్యానిస్తున్నాను, మా బుద్దిని నువ్వు ప్రేరేపించు అని. సకల జీవులలో చైతన్య స్వరూపముగా ఉన్నటు వంటి ఆ జగన్మాత గాయత్రీ ప్రేరణతో మన సంస్థ తరుపున ప్రతి నెల వెలువడుతున్న సంచిక ఈ ధర్మవారధి సంచిక. ద్రియతెవా జన యతితి ధర్మం అని ధరించి ఆచరించేదే ధర్మము అని శాస్త్రం మనకు చెపుతోంది. ఆ ధర్మము అందరికి తెలియజేయటం కోసం ఈ మధ్యమము ద్వారా సులువుగా తేలికగా వీలైనప్పుడు చదువుకునే విధముగా ఈ పత్రిక తయారు చెయ్యడం జరిగింది. ధర్మస్య విజయోస్తు.
ప్రతి నెల 21వ తారీఖున ఈ పత్రిక విడుదల చెయ్యడం జరుగుతుంది.ఈ పత్రికను మీరందరు ఆదరిస్తారని ఆశిస్తున్నాము. పత్రికలో ఇవ్వబడ్డ Feedback & Suggestions కు మీ సలహాలు సూచనలు పంపించమని మనవి.
Page 1 2 3 4 5 6 |