Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

ధర్మవాణి – వ్యక్తిత్వ వికాసం

మనల్ని మనము సమీక్షించుకుంటూ, మంచి నడవడికను పొందటానికి కావాల్సిన లక్షణములను అలవరచుకుంటూ, మనలోని చెడు లక్షణాలను వదిలించుకునే ప్రయత్నం చేస్తూ, మనల్ని మనం నిరంతరం మెరుగుపరుచుకోవటమే ‘వ్యక్తిత్వ వికాసం’.

వ్యక్తిత్వ వికాసం అంటే?

వ్యక్తిత్వం అంటే ‘సత్ప్రవర్తన’, వికాసం అంటే దాన్ని పెంపొందించుకోవడం అని భావిస్తే, ‘ప్రయత్నపూర్వకంగా సత్ప్రవర్తనను నిరంతరం పెంచుకొనే ప్రయత్నం చెయ్యటమే’, వ్యక్తిత్వ వికాసం అని అర్థం చెప్పవచ్చు. తనకు తాను కుటుంభానికి, సంఘానికి కలుషితం కలుగనీయకుండా ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించినప్పుడే ఒక వ్యక్తిగా ఉద్ధరింపబడుతాడు. వ్యక్తి బాగుంటే, కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే లోకం క్షేమముగా ఉంటుంది, కావున మనమందరం నిరంతరం మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకునే ప్రయత్నం చెయ్యాలి.

‘నేను, నా’ అనే అహం వదిలి ‘మనం’ వైపుగా ప్రయాణించటమే వ్యక్తిత్వ వికాసం. అసుర లక్షణాలను వదిలి దైవ లక్షణాలను అలవర్చుకోవటమే వ్యక్తిత్వ వికాసం. ఆ పరమాత్మ ప్రసాదించిన బుద్దిని ఉపయోగించి సత్కర్మలకు, దుష్కర్మలకు తేడాను గ్రహించి దుష్కర్మలకు దూరముగా ఉంటూ, సత్కర్మలను ఆచరిస్తూ, సదాచారాల పట్ల అనురక్తులై ఉండటమే వ్యక్తిత్వ వికాసం.

వ్యక్తిత్వ వికాసం ఎలా?

జగద్గురువుల బోధనలతో, గురువుల మార్గదర్శకత్వములో, సజ్జనుల సాంగత్యములో, సత్సంగముతో, మహనీయుల చరిత్రలు, గీత ఇత్యాది సద్గ్రంథాల పఠనంతో మనల్ని మనం మెరుగుపరుచుకోగలుగుతాము. గీత, రామాయణం, మహాభారతం ఇత్యాది సద్గ్రంధాలు మనకు ఎన్నో విశిష్టమైన విషయాలను బోధిస్తాయి. గీతని మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. పురాణ పఠనం కూడా మనకు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తుంది. అలాగే మహనీయుల చరిత్రలు తెలుసుకోవటం, వారి జీవితాల నుంచి మంచి విషయాలను గ్రహించటం, వాటిని మన జీవితములో ఆచరించే ప్రయత్నం చెయ్యటం ద్వారా కూడా మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోగలుగుతాము.

వ్యక్తిత్వ వికాసానికి అతి ముఖ్యమైనది సత్సంగము. సూర్యోదయంతో ఎలా అయితే పుష్పాలు వికసిస్తాయో, అలాగే సజ్జనుల సాంగత్యములో, సత్సంగముతో మన వ్యక్తిత్వం వికసిస్తుంది. మనము ఇతరుల మంచి విషయాలను విషయాలను గ్రహించటం, వాటిని మన జీవితములో ఆచరించే ప్రయత్నం చెయ్యటం ద్వారా మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోగలుగుతాము.

మనము ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలో, ఎటువంటి లక్షణాలను కలిగి ఉండకూడదో, మన నడవడిక ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మహర్షులు మనకు అనేక ధర్మశాస్త్రాల్లో బోధించారు. మన శాస్త్రాలలో పేర్కొనబడ్డ ‘వ్యక్తిత్వ వికాసానికి’ సంభందించిన అనేక సూచనలు, మార్గాలు, లక్షణాలను పూజ్య గురుదేవులైన బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తిగారు ‘ధర్మవాణి’ శీర్షిక రూపేణా మనకందించారు. వాటిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.

  1. జీవరాసుల నుంచి విజ్ఞానం – నిరంతరం నేర్చుకోవటం
  2. మనము నేర్చుకొని ఆచరించాల్సిన కొన్ని మంచి విషయాలు:
    • మాటలు ఎలా మాట్లాడాలి
    • నిందా స్తుతులను ఎలా స్వీకరించాలి
    • కోపం
  3. లక్ష్యసాధనకు కావాల్సిన లక్షణాలు ఏమిటి?
    • లక్ష్యసాధనలో ధ్రుతి
    • లక్ష్యసాధనలో ద్రుష్టి
    • లక్ష్యసాధనలో మతి
    • లక్ష్యసాధనలో దాక్ష్యం 

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy