శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
801. పుష్టా | ||
పరిపూర్ణత కలిగి వున్నది పుష్ఠిని కలిగించునది. నిత్య తృప్తిని కలిగిస్తుంది. ఈ సకల సృష్టిని పరిపూర్ణముగా పోషించునది కనుక పరమేశ్వరి పుష్టా అని పూజింపబడునది.🙏 🌺కష్ట కాలములో జరిగే సంఘటనలు, పూర్వ జన్మ లో చేసిన పాపముల వలన, లేదా కలియుగములో ఐతే ఈ జన్మలో చేసిన పాపము వలన కూడా జరుగుతాయి. ఏది జరిగినా, పాప ప్రక్షాళన ఐయ్యింది అన్న ఆత్మ బోధ కలిగినప్పుడు, పరాశక్తి తమ భక్తులను కాపాడుతుంది, కష్టాలను దూరము చేస్తుంది అన్న ఈ నమ్మకానికి మించిన ఆత్మ తృప్తి మరియొక్కటి వుండదు 🌺 |