శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
900. విజ్ఞానకలనా | ||
బ్రహ్మ జ్ఞాన స్వరూపిణి ఆత్మ సాక్షాత్కారం పొందినది. ఆత్మయే బ్రహ్మా స్వరూపము. అటువంటి జ్ఞానమును పొందడమే విజ్ఞానకలనా. విజ్ఞానము ప్రసాదించే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 సామాజిక విషయాల పట్ల జ్ఞానము కలిగి ఉన్నా, ఆత్మ జ్ఞానము పొందడము, కేవలము హనుమ రూపములో ఉన్న గాయత్రీ జపముతోనే సాధ్యము 🌺 |