శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
856. కల్పనారహితా | ||
కల్పనకు అతీతమైనది సృష్టి అంతయూ పరమేశ్వరి కల్పననే, కానీ తను మాత్రము కల్పనారహితా. ప్రళయము ఆసన్నమైనప్పుడు, తాను కల్పన చేసిన లోకాలను తనలోనే ఐక్యము చేసుకుంటుంది. కల్పనకు అతీతమైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 అశాశ్వతమైన ఈ మానవ జీవితములో , పరమేశ్వరి యొక్క పాద సేవతో తరింపబడుదాము, ముక్తిని పొందుదాము 🌺 |