శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
878. సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా | ||
ఆత్మ బోధ కలిగిస్తుంది. సంసారం అనే మాయలో చిక్కుకున్న వారికి జ్ఞాన భిక్ష పెడుతుంది . తన భక్తులకు మాయ నుండి విముక్తి కలిగించి, జ్ఞాన బోధ చేసి, వారి జీవితాన్ని ఉద్ధరిస్తుంది. ఆత్మబోధను ప్రసాదించే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 జనక మహారాజు లాగా, కర్మ సిద్ధాంతాన్ని పాటించాలి. మన కర్తవ్యమును నిర్వర్తించి, ఫలితాన్ని పరమేశ్వరి యొక్క అనుగ్రహానికి వదిలేయాలి 🌺 |