శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
1. శ్రీ మాతా | ||
శ్రీ చక్ర మందలి అవ్యక్త త్రికోణ మంధ్యంతర బిందురూపిణియే శ్రీ మాతా . అంటే ''బ్రహ్మాస్త్రకుండికహస్తాం ' శుద్ధ జ్యోతి స్వరూపిణి , సర్వతత్వమయీమ్ వన్డే గాయత్రీ వేదం మాతరం ' 'ఈ శ్రీ వికసించి * శ్రీ మాతా * అయినది .శ్రీ మాతా అన్నది శివశక్తి స్వరూపాలు . ఈ సృష్టి కి తల్లి ఐన శ్రీమాత కు నమస్కారము 🙏 *ఈ నామం జపిస్తే మనలో కలిగే* *మానసిక పరివర్తనలు* * మనిషిగా జన్మించిన నేను జీవితాన్ని సార్ధకం చేసుకోవడానికి , పవిత్రమైన పరమౌత్క్రుష్టమైన రక్షణంతో , పోషణతో , సృజనాత్మకతతో కూడిన మాతృత్వాన్ని , స్వభావాన్ని , ప్రయొజకత్వంతో కూడిన దైవ లక్షణాన్ని , సమర్థతను పొందడానికీ ప్రయత్నిస్తున్నాను .నాకు తగిన బుద్ధివివేకములను ప్రసాదించి , శాంతి తత్వంతో జీవించే భాగ్యాన్ని కలిగించు తల్లి అని వేడుకుంటున్నాను . ఇలా సదాలోచన కలుగుతుంది 🙏 * |