మానవులయుక్క భావనలు రెండు రకములు.
1) ప్రవృత్తి భావన అనగా జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అన్నియూ వేరు వేరని, నామరూపములే శాశ్వతమని, దేహమే శాశ్వతం అని, ఇంద్రియప్రవుత్తియే శాశ్వతమన్న భ్రాంతిలో వుంటాడు.
సాఫల్య వైఫల్యములను లేఖ చూసుకోవటమనే ద్వంద మార్గములో జీవ మార్గములో వున్నంతవరకు దానిని ప్రవృత్తి మార్గము అంటారు. దానినే నశ్వర మార్గము అని కూడా అంటారు.
నశ్వర అంతయూ మాయ. ఈ జగత్తు నందు ఒక నాడు పుట్టి కొంతకాలము పెరిగి తరువాత పోయే మనందరము కూడా ఆ అఖండ కాలముతో చూస్తే నశ్వర పదార్థములమే.
కాబట్టి ప్రవృత్తి మార్గమునందు దేహేంద్రియ లక్షణముతో మాత్రమే బ్రతకటం ప్రవృత్తి.
2) అనశ్వరమైన బ్రహ్మమును గూర్చి ఎవరు ఉపాసన, తపస్సు, ధ్యానము చేస్తారో "బ్రహ్మ సత్యం జగన్మిద్య " అన్న భావమును లోపల పెట్టుకొని చివరకు చేరే పరంధామమునకు.
"యత గత్వాననీవర్తతే తద్దామ పరమం మమ " అని ఎక్కడకు వెళితే తిరిగి వెనకకు రావలసిన అవసరము లేదో, మళ్లీ చావుపుట్టుకలు ఆత్మకు పట్టవో, అట్టి పరంధామమును వెతుక్కుని బ్రహ్మ మార్గమునందు ప్రయాణము చేయటము నివృత్తి.
అప్పుడు "ఉపశాంతోయం ఆత్మ " అని శృతి, వేదం చెపుతోంది. అంటే అప్పుడు ఆత్మకు శాంతి వస్తుంది.
నేను ఇక్కడ వున్నాను, ఈ దేహము నేను, ఈ దేహము సర్వస్వము అన్న బ్రాంతి నుండి బయటపడి,..
బ్రహ్మమే నేను, అనశ్వరమే నేను అన్న భావన కలిగినప్పుడు దానికి శాంతి వస్తుంది.
ఆ శాంతినించే తేజస్సు సుషుమ్న అనే ముఖ్యప్రాణం మనలో ఏదైతే వుందో దానిని 'శాంతి అని అంటారు.
భావనా సంకల్ప రాహిత్యమే శాంతం. శాంతి స్వరూపిణి ఐనా తల్లికి నమస్కారము 🙏
🌺మనసుకు నిశ్చలత్వము, శాంతము, సహనము కలిగి ఉండి వ్యవహరించ గలుగుతాము 🌺
|