శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
115. .భద్రప్రియా | ||
భద్ర అంటే బ్రహ్మ. బ్రహ్మప్రియ, అంటే ఈశ్వర ప్రియ, పరబ్రహ్మ ప్రియ. అభయప్రదానం చేయటంలో ప్రీతికలది కాబట్టి భద్రప్రియా అని కూడా చెప్పుకోవచ్చును. తన భక్తుల భయము లన్నిటిని తొలిగించుటకు మళ్లీ ఆమెయే అభయముద్రలు కలిగివున్నది. ఆ మంగళప్రియకు నమస్కారము 🙏. 🌺 మన జీవితంలో నిత్య కర్మములు ఆచరించేటపుడు ఎన్నో అడ్డంకులు, ఎదురు అవుతూవుంటాయి. వాటినించి మనకు భద్రత కలిగిస్తుంది🌺 |