శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
193. దుష్ఠదూరా | ||
స్వార్థం కొరకు ఇతరులను బాధ పెట్టె వారు దుష్టులు. అట్టి వారికి అమ్మ కరుణ, కటాక్ష, వీక్షణాలు పొంద శక్యము కాదు. తాము నమ్మిన సిదాంతాన్ని, అమలు పరచడానికి ప్రపంచాన్ని పీడించేవారు, నాశనం చేయు వారు దుష్టులు. వారికి దూరమైనది కాబట్టి దుష్ఠదూరా. దుష్టులను దూరంగా వుంచే తల్లికి నమస్కారము 🙏 🌺సత్సాంగత్యం లో వుంటూ, భగవంతుడి నామము చేస్తూ దుష్ట భావాలను మన మనస్సుకు అంటకుండా దూరం పెడతాము .🌺 |