శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
180. నిర్నాశా | ||
నాశనము కానిది. ఈ సృష్టి కి మూలము అయినటువంటి దేవికి.. ఆది, మధ్యమ, అంతములు ఏమియు లేనటువంటిది. ఆ తల్లీ యుక్క కరుణ, దయ, నాశనంకానటువంటిది. ఎల్లపుడు దివ్య జ్యోతిలా కాంతివంతంగా వెలుగుచు వున్నటువంటిది. ప్రతి మానవుడికి తల్లీ ప్రేమ నాశ రహితమైనది. ఎన్ని అవాంతరాలు వచ్చినా , తన పిల్లలే తన మనస్సు ను కష్ట పెట్టినా మాతృ ప్రేమ తన పిల్లల పట్ల ఎన్నటికీ నశించదు. నిర్నాశా గా వున్నా ఆ మాతృ ప్రేమయే లలితా పరమేశ్వరి. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మనలో ఆత్మవిశ్వాసం మరియు ధర్మ బుద్ధి నాశనం కాకుండా కాపాడుకోగలుగుతాము 🌺 |