శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
153. నిష్కళంకా | ||
*నిష్కళ* : అంటే పరిపూర్ణ పరతత్వము. *కలంక :* మాయను, పరబ్రహ్మను తనయందే ధరించినది. *నిష్కాల* :సమాధి యందు కాల స్ప్రుహ వుండదు. అట్టి సమాధి స్థితి తానే అయినది. కళంకము, పవిత్రత అన్నవి నామ రూపముల వరకే. కార్య కారణములు వున్నంతవరకే, ఆపైన లేవు. మహాయాగ స్థితిలో సుధాధారాభి వర్షిణియైనప్పుడు సుషుమ్న నిష్కళంక. మాయ అంటనిది. అట్టి తల్లికి నమస్కారము 🙏 🌺కళంకము లేని దృష్టితో ప్రపంచాన్ని చూడగలుగుతాము. వీరు మంచి వారు, వీరు చెడ్డ వారు అన్న ద్రుష్టి పోయి, అందరు అమ్మాయుక్క సృష్టి అన్న భావన కలిగుతుంది. విశాల ద్రుష్టితో కూడిన ఆలోచన విధానం ఏర్పడుతుంది 🌺 |