శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
168. నిష్క్రోధా | ||
క్రోధము (కోపము) లేనటువండిది. కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యాలు అను అరిషడ్వర్గాలను జయించిన వారు మాత్రమే ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి వెళతారు అన్నది మనకి అన్ని వేద గ్రంధాలలో తెలియపరిచారు. అంతేకాక కామ,క్రోధ,లోభ,మోహ, మద,మాత్సర్యాలలో కూడ మొదట కామం నే తీసుకున్నారు. ఎందుకంటే ఈ లక్షణాలు కామం వలననే కలుగుతాయి కాబట్టి. ఇదే విషయాని భగవద్గీతలో శ్రీకృష్ణుడు “విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాని యందను రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధము కలిగెను. క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుధి ని కోల్పోయి చివరకు అధోగతి చెందును”. అంటే కామం నుంచి క్రోధము కలగడం వలన చాల చాల దుష్ప్రయోజనాలు వున్నాయి. అందువల్ల కోరికలను, క్రోధాన్ని జయించాలి అంటే సత్సాంగత్వం వుంటే సత్బుధి కలిగుతుంది. తత్ద్వారా క్రోధాన్ని జయించగలము. ఆ పరాత్పరి ని నిష్క్రోధా గా చేరుకోగలము. క్రోధాన్ని జయించినటువంటి తల్లికి నమస్కారము 🙏 🌺కోపము, ద్వేషము వంటి బలహీనతలకు లొంగకుండా వుండే తత్వం ఏర్పడుతుంది 🌺 |