శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
160. నిశ్చింతా | ||
చింతరహితమైనది. బాధ, దుఃఖం, కష్టం ఇటువంటివి ఏమియు లేవు అన్నదానిని నిశ్చింతా అన్న అర్ధం. సకల లోకములకు ఆది దేవత అయిన ఆ జగన్మాతకు చింత అను స్మ్రితి ఎకాలమునందు కలగదు. చింత అన్నది ఇంద్రియ భావన రూపము. అంతర్యాగ రహోయాగ ములో చింత అంటే కులమార్గము. నిశింత అంటే అకుల మార్గము. ధ్యానములో కుండలిని , జాగ్రత్త స్వప్న దశలను దాటేవరకు చింత(సంసారిక భాదలు ) మన వెంట వుంటుంది. సుషుమ్న చేరేటప్పడికి చింత పోయి, నిశ్చింత యోగం లో ప్రస్థానము అవుతుంది. ముఖ్య ప్రాణము అయిన సుషుమ్న యుక్క లక్షణం ఆనంద ఘన. చింత జీవలక్షణం, నిశ్చింత ఆత్మ లక్షణం. నిశ్చింత ఆనందంలో లయం. ఆత్మ పరమాత్మలో లయం. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺చింత అనేది మానవ సహజం. ఈ నామము పట్టించడం వల్లన, చింత అన్నది, మనస్సును ప్రభావితం చెయ్యని స్థితి కలుగుతుంది. ఎటువంటి ఎదురుదెబ్బలు, పరీక్షలు, దుష్ట ఫలితాలు ఎదురైనా, ఆత్మ విశ్వాసాన్ని పెచుకొని, చింతను తొలగించుకొనే తత్వం అలవడుతుంది. 🌺 |