శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
158. నిర్మదా | ||
మదము లేనిది. అహంకారముచే మదము పుడుతుంది. ఆధిపత్య భవముచే మదము, మరియు నూన్యత సంక్లిష్ట భావముచే ఈర్షా ప్రతి మానవుడిలోనూ జనించును. ఈ మద, ఈర్షా భావములు మాయా వృత్తి. ఈ మాయా కు అతీతమైనది నిర్మదా. ఆకులమార్గములో ప్రయాణించేటప్పుడు ముఖ్య ప్రాణం నిర్మదా. మన భావన నిర్మదగా వుంటేనే, ఆ తల్లియుక్క క్రియాయోగ రహస్యం తెలుసుకోలేము. మద రహితముగా వుండే తల్లికి నమస్కారము 🙏. 🌺మనలో గర్వము, దర్పము వంటి బలహీనతలు లేనటువంటి జీవనము సాగించగలుగుతాము 🌺 |