శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
157. రాగమధనీ | ||
రాగమును మధించుట. రాగము అనగా రాగము, మనలో వుండే రాగము, ద్వేషము. ఈ భావమునను నశింపచేసేది రాగమధనీ. మన శరీరములో వుండే ఇడ పింగళ నాడులు, వాటిలో నుండి శ్వాస ప్రయాణం జరిగినప్పుడు నామరూపాత్మక భావన కలుగును. ఇడ పింగళ నాడులను చంద్రసూర్య నాడులు అని కూడా అందురు. అనగా రెండు ముక్కుపుటాల్లో నుండి ఒకే పర్యాయం శాస్వ యుక్క ఆగమ, నిర్గమాలను నియమించటమే నిరాగ. అదే రాగమధని ప్రక్రియ. రాగమున్నతవరకు మాయ.., మాయ అంతరిస్తే బ్రహ్మ. మనలో వుండే రాగ ద్వేషాలను నశింపచేసే తల్లికి నమస్కారము 🙏. 🌺 లక్ష్యం సాధించటానికొరకు, మనము నిరంతరం ప్రయత్నం సాగిస్తాము. ఆ ప్రయత్యం మధ్యలో కొన్ని అడ్డంకులు, బంధనాలు రూపేణ (మమకారము, ద్వేషము, ఈర్షా వంటివి )వచ్చే ప్రమాదము వున్నది. ఈ నామము పట్టించినందున ఆ బంధనాలు తో కూడిన ఇతర కోరికలు కలగకుండా మన మార్గము సుగమం అవుతుంది. మన లక్ష్యాన్ని సాధించగలుగుతాము 🌺 |