శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
137. నిరాకారా | ||
ఆకారములేనిది నిరాకారా. రెండు చిదగ్నిబీజములతో కూడిన పరాశక్తి. రాకా అంటే పూర్ణిమ, అట్లనే అమావాస్య స్వరూపిణి కూడా అమ్మవారే. నిష్కళం, నిష్క్రియం, శాంతం, నిరవద్యం, నిరంజనం అన్న కారణంచేత అఖండ పూర్ణతత్వం. అది అంశులకు అతీతమైనది, క్రియలకు అతీతమైనది. సమరసము, హెచ్చుతగ్గులకు అతీతమైనది. అన్నియేందు తానై వున్నది. అఖండము, అనంతము అయినదానికీ అకారము లేదు. ఆకారములన్నిటిని సృష్టించిన తల్లీ నిరాకార. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మన ఆలోచనలు ఏ ఒక్క ఆకారానికో పరిమితం కాకుండా, దేనికోసం ఐతే ప్రయత్నిస్తామో, దానిలో పరిపక్వత కలిగి, నిరాకార వలే సాధన చేయగలుగుతాము. 🌺 |