శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
144. నిత్యముక్తా | ||
నిత్యముక్త అంటే మంత్రబీజ స్వరూపిణి. నిత్య స్బబ్దముచేత నాదస్వరూపిణి అని రహస్యం. అకుల మార్గమునందు సుషుమ్నా ప్రయాణములో భావముకాని, అభావముకాని, విభావముకాని వుండవు. స్వపర భేదములు వుండవు. కేవలము బ్రహ్మెక్య స్థితి అన్న జ్ఞేయ స్థితియే వుంటుంది. అప్పుడు సుషుమ్న ఆత్మ స్వరూపిణియై సహస్రారమునందలి సదాశివ తేజమునకు పయనిస్తుంది. అప్పుడు ఆమె నిత్యముక్త అని పిలవబడుతుంది. నిత్యముక్తురాలైన తల్లికి నమస్కారములు 🙏 🌺చేసే ప్రతి కార్యంలో అన్ని స్థాయిలలోనూ నేను చేస్తున్నాను, నాది అనే విదంగా కాక, ఒక అవకాశమును వినియోగించుకోగలుగుతున్నాను అనే భావంతో చేస్తూ ఉంటే అప్పటికప్పుడు విముక్తులమవగలుగుతాము. ఏది భారంగా అనిపించదు 🌺 |