శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
120. భక్తివశ్యా | ||
పరమేశ్వరి యందు మనస్సు అర్పించడాన్ని భక్తి అన్నారు. అంతటా తానై నిండి వుంది అన్న భావన కలగాలి. ఏ పని చేస్తున్న ఆ తల్లియుక్క నామస్మరణ చేస్తూ ఆత్మనాత్మ విచారణలో దేహేంద్రియ బ్రాంతిని, దేహాత్మ బ్రాంతిని, దేహప్రాణ బ్రాంతిని, అంతా ఆ జగన్మాత నిండివున్నది అని మనసుకు తెలపాలి. బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగములలో కృతకృత్యుడైన సాధకుడు సహజాప్రస్థానము మహాయాగము. అదే నిర్వాణపదం. సాధకుడు పూర్ణాభిషిక్తుడవుతాడు. అనగా బ్రహ్మశీర్షములోని అమృతవర్షాన్ని అంతరశరీరములో 72వేల నాడులను తేజోవంతం చేసి, జ్యోతి రూపేణ నిర్వాణాతీత చేరుకుంటాడు. భక్తికి వశమగునట్టి తల్లికి నమస్కారము 🙏 🌺శ్రద్ధ, భక్తి అన్న ఈ రెండు లక్షణములను అమ్మ భక్తికై వశం కావాలి🌺 |