శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
138. నిరాకులా | ||
ఆకుల పొందటం అంటే సంక్షోభాన్ని(కలవర పడటం ) తాపత్రయాన్ని పొందటం. అది ఆజ్ఞాచక్ర పర్యంతమే వుంటుంది కాని, చిదాకాశంలో ఏ ఆకులతత్వము వుండదు. ఆకులము లేనిది కాబట్టి శాంతి స్వరూపిణి. కులమార్గమునందే ఆకులము నామరూపములను కల్పించగలదు. అది ఆ పరాదేవి మాయావిలాసం. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺అవిద్యను, బలహీనతను కూడా ఆదరించగల ప్రజ్ఞ వివేకం కలుగుతుంది. అంతే కాక వాటి ప్రభావం మనమీద పడినా, కలత చెందకుండా వుండగలుగుతాము. 🌺 |