శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
190. దుర్గా | ||
దుర్గా అంటే చెడుని నాశనం చేయడం. దుర్గమ్ముడు అనే రాక్షస సంహారము తో దుర్గా అన్న నామముతో పిలవబడుతుంది ఆ తల్లీ. ఇంద్రాది దేవతల భయాన్ని పోగొట్టిన తల్లీ దుర్గా. దుర్గా అన్న నామముతో మనలో వుండే రాక్షస బుద్దిని, భవబంధన వ్యామోహన్ని ,, శోకాన్ని, యమదండ భయాన్ని, రోగములను,...వీటిన్నిటిని చంపివేయునట్టిది. పాపనాశిని, దుఃఖహంత్రి, దుర్లభ, ఇవన్నియూ దుర్గతత్త్వములే. దుర్గా దుఃఖ నాశిని, దుర్గా ప్రారబద్ధ నాశిని. అట్టి ఆ తల్లీ కి నమస్కారము 🙏 🌺ధర్మ మార్గములో మన జీవనం సాగిస్తున్నప్పుడు, ఎదురయ్యే ఎన్నో అవాంతరాలు, బలహీనతలు, వ్యామోహాలు వంటి దుష్ట ప్రభావాలను ఖండించే శక్తి మనలో ప్రవేశిస్తుంది🌺 |