శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
111. బిసతంతు తనీయసీ | ||
*తంతు* : దారమువలె, సన్నగా, సూక్ష్మంగా అన్ని చోట్ల వున్నది. *తనీయసీ* : సూక్ష్మాతి సూక్ష్మమైనది. తామరతూడులోని ధారమువలె సూక్ష్మమైనది. ఉదాన వాయువుతో ఉజ్జివితమైన సూక్ష్మనాడి సుషుమ్న. అదియే బిసతంతు తనీయసీ. తామరతూడులోని ధారం మాదిరిగా సూక్ష్మరూపంతో భాసిల్లు తల్లికి నమస్కారము 🙏 🌺ఆధ్యాత్మికంగా, చాలా తెలుసుకోవాలి అనే దృఢనిశ్చయమునకు వచ్చి, అతి సూక్ష్మంగా వున్న ఆత్మ పరిశోధనకు ప్రయత్నం మొదలుపెడుతాము 🌺 |