శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
134. నిర్లేపా | ||
లేపము అంటే పైపూత. అట్టి లేపారహితమైనది, స్వఛ్చస్పటిక పవిత్రమైనది పరమేశ్వరి అని అర్ధం. మాయా తానేనను మాయా అంటనిది నిర్లేప. జన్మ, జరా రుజా మృతువు అంటనిది నిర్లేప. వాసనలు, సంస్కారములు, సంకల్పములు, వికల్పములు ఇవన్నియూ లేపములు. కార్యకరణములు లేపములు. స్థూల, సూక్ష్మ కారణశరీరములు లేపములు అవి అంటనిది జగన్మాత అన్నిటియందు తానుయై అన్నింటికీ అతీతమైనది ఆ జగన్మాత. 🙏 🌺ఈ మాయా ప్రపంచంలో, ఎన్నో ఆకర్షింపబడేవి వున్నప్పటికీ, వాటికి లొంగకుండా వుండగలుగుతాము, అమ్మవారి నామ జపంతో 🌺 |