శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
154. నిరూపాధి | ||
మధ్యమునకే ఉపాధి వుంటుంది. అమృతత్వమునకు ఉపాధి లేదు. సజాతీయ, విజాతీయ స్వపర భేదములు లేని ఆ పరమేశ్వరి నిరుపాధి: అని అర్ధం. భేద బుద్ధి లేని ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ఏ స్థాయిలో వున్నా, ఎవరితో వున్నా, మన స్వధర్మాన్ని మరిచిపోయి ప్రవర్తించము. స్వధర్మ అంటే మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్ధి తో మన సంస్కారాన్ని విస్మరించకుండా పాటించటం . స్వార్థ బుద్ధి ని ఆమడ దూరంలో వుంచగలుగుతాము, స్వపర భేదములు లేకుండా వుండగలుగుతాం 🌺 |