శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
191. దుఃఖహంత్రీ | ||
దుఃఖములను పోగొట్టునది. తనను ఆశ్రయించిన భక్తులకు దుఃఖము నశింపజేస్తుంది . దుఃఖము అన్నది మనలో వుండే మాయ. ఏది సత్య- ఏది అసత్యం, ఏది సుఖం- ఏది దుఃఖము, ఏది శాశ్వతం- ఏది ఆశస్వాతం అన్న జ్ఞానాన్ని మనకు తెలియజేసి మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. 🌺అంతా మన మంచికే అన్న స్వభావము ఏర్పడుతుంది. మనముకోరుకున్నది దొరకనప్పుడు, నిరాశ చెంది అజ్ఞానం లో పడకుండా మనస్సును నిగ్రహం చేసుకోగలము.🌺 |