శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
105. సహస్రారాంబుజారూఢా | ||
*సహస్ర* : ఈశ్వరప్రతిబింబమును తనలో ఇమడ్చుకొని వికసించిన మూలప్రకృతి అని అర్ధము. సహస్రారమే శ్రీ రాజరాజేశ్వరీ స్థానము. ఇచట భూతతత్వమైన మూలాధారములోని 56 కిరణములు, అగ్నితత్వమైన స్వాధిష్ఠానములోని 62 కిరణములు, జలతత్వమైన మణిపురములోని 52 కిరణములు , వాయుతత్వమైన అనాహతములోని 54 కిరణములు , ఆకాశతత్వమైన విశుద్ధములోని 72 కిరణములు , మనస్తత్వమైన ఆజ్ఞాచక్రములోని 64 కిరణములు - మొత్తము 360 కిరణముల కంటే ఇది మిన్నగా వుంటుంది కాబట్టి దీనికి సహస్రారము అని పేరు కలిగింది. బ్రహ్మరంద్రానికి దిగువున గల వేయి దళాలున్న పద్మాన్ని చేరి భాసిల్లు తలికి నమస్కారము 🙏 🌺ప్రపంచమంతా మనము పెట్టుకున్న లక్ష్యమే కనిపిస్తుంది. దానియందు లీనమై, ప్రకాశవంతమైన భావనలు, ఆలోచనలు కార్యసిద్ధి కొరకే వినియోగిస్తాము 🌺 |